దేశంలో రికార్డ్ స్థాయిలో నిరుద్యోగం

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 06:05 AM IST
దేశంలో రికార్డ్ స్థాయిలో నిరుద్యోగం

Updated On : January 31, 2019 / 6:05 AM IST

దేశంలో నిరుద్యోగం పెరిగింది. (2017-18)  సంవత్సరంలో నిరుద్యోగ‌శాతం 6.1 శాతంగా న‌మోదు అయ్యింది. 45 ఏళ్లలో ఈ రికార్డు స్థాయిలో నిరుద్యోగ శాతం నమోదు అవ్వడం ఇదే మొద‌టిసారి. 2017-18 నిరుద్యోగ శాతం ఎక్కువ‌గా ఉన్న‌ట్లు నేష‌న‌ల్ శాంపిల్ స‌ర్వే ఆఫీస్(NSSO’S) త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. ఈ రిపోర్ట్‌ను “బిజినెస్ స్టాండెర్డ్ న్యూస్ పేపర్” ప్ర‌చురించింది. నేష‌న‌ల్ స్టాటిస్‌స్టిక‌ల్‌ క‌మిష‌న్ డిసెంబ‌ర్‌లో ఈ నివేదిక‌ను రూపొందించినా దాన్ని ప‌బ్లిష్ చేయ‌లేదు. అయితే తాత్కాలిక బ‌డ్జెట్‌కు ముందు ఈ నివేదిక‌ను రిలీజ్ చేశారు. నేష‌న‌ల్ స్టాటిస్‌టిక‌ల్ క‌మిష‌న్‌లో ప‌నిచేసే ఇద్ద‌రు ఉద్యోగులు రెండు రోజుల క్రితం రాజీనామా కూడా చేశారు.

ప్ర‌ధాని మోదీ నోట్ల ర‌ద్దు చేప‌ట్టిన త‌ర్వాత ఉద్యోగ నియామ‌కాల‌పై మొద‌టిసారి స‌ర్వే చేప‌ట్టారు. ఈ డేటాను జూలై (2017-18) మ‌ధ్య సేక‌రించారు. (1972-73) మ‌ధ్య ఉన్న నిరుద్యోగ శాతం క‌న్నా ఇప్పుడు ఎక్కువ‌గా ఉంద‌ని స్టాటిస్‌స్టిక‌ల్ రిపోర్ట్  తెలిపింది. (2011-12) లో నిరుద్యోగం 2.2 శాతం ఉండ‌గా, (2017-18) లో అది 6.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం 17.4 శాతం పెరిగిన‌ట్లు తేలింది. ఇక ప‌ట్ట‌ణాల్లో అది 18.7 శాతంగా న‌మోదు అయ్యింది.