JEE Advanced Exam: కొవిడ్ ఎఫెక్ట్.. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా

దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా పడింది. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జూలైలో జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షను ఐఐటీ ఖరగపూర్ వాయిదా వేసింది.

JEE Advanced Exam: కొవిడ్ ఎఫెక్ట్.. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా

Jee Advanced Postponed Due To Covid Surge

Updated On : May 26, 2021 / 4:29 PM IST

JEE Advanced Exam Postponed : దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష వాయిదా పడింది. కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది జూలైలో జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షను ఐఐటీ ఖరగపూర్ వాయిదా వేసింది. జేఈఈ మెయిన్ అడ్వాన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారం.. జూలై 3, 2021న జరగాల్సి ఉంది.

ప్రస్తుతం మహమ్మారి పరిస్థితుల్లో మెయిన్ పరీక్షను వాయిదా వేయనున్నట్టు ప్రకటించింది. అయితే సవరించిన పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించిస్తామని ఐఐటి ఖరగ్‌పూర్ ప్రకటనలో వెల్లడించింది. జేఈఈ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఈ పరీక్షలో JEE అడ్వాన్స్డ్ పేపర్ I, పేపర్ II అనే రెండు పేపర్లు ఉంటాయి.

జేఈఈ అడ్వాన్స్ ర్యాంక్ సాధించే విద్యార్థులు దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. పేపర్ I ఉదయం షిఫ్టులో జరగాల్సి ఉంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ -2 మధ్యాహ్నం షిఫ్టులో జరుగనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఈ పేపర్ పరీక్షను నిర్వహించనున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ద్వారా దేశంలోని 23 ఐఐటిలలో బ్యాచిలర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, డ్యూయల్ డిగ్రీ కోర్సులకు ప్రవేశం పొందవచ్చు. ప్రతి ఏడాదిలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటిలు- ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబై, ఐఐటి గువహటి, ఐఐటి రూర్కీ సంయుక్తంగా నిర్వహిస్తాయి.