మహిళా నిరుద్యోగులకు మే 16న జాబ్ మేళా

  • Published By: veegamteam ,Published On : May 14, 2019 / 05:17 AM IST
మహిళా నిరుద్యోగులకు మే 16న జాబ్ మేళా

Updated On : May 14, 2019 / 5:17 AM IST

నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తోంది హైదరాబాద్ సిటీ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. 2019, మే 16వ తేదీ ఉదయం 10 గంటలకు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ క్యాంప్ ఉంటుందని వెల్లడించారు ప్రిన్సిపాల్ యాదగిరి. BSC, PG పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలనే ఓ మంచి ఆలోచనతో దిశా ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. నిరుద్యోగ మహిళలు ఆసక్తి ఉంటే.. కళాశాలలో నిర్వహించే జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు.

ఉద్యోగం చిన్నదా పెద్దదా అనే ఆలోచన వదిలేస్తే మంచి విజయాలు సాధించవచ్చని సూచించారు. ఈ జాబ్‌మేళాలో ఉద్యోగం పొందిన వారందరికి మంచి భవిష్యత్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను సెలక్ట్ చేయడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం 7569732412 కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు.