JOBS : టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీ

ఎంపిక విధానికి సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 20, 2022గా నిర్ణయించారు.

JOBS : టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీ

Tata Memorial Center

Updated On : June 2, 2022 / 4:15 PM IST

JOBS : వారణాసిలోని టాటా మెమోరియల్ సెంటర్ కు చెందిన హోమీ భాభా క్యాన్సర్ హాస్సిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో ఫెలోషిప్ , సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 63 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ఫెలోషిప్ పోస్టులు 17 ఖాళీలు, సీనియర్ రెసిడెంట్ పోస్టులు 36 ఖాళీలు, మెడికల్ ఆఫీసర్ పోస్టులు 10 పోస్టులు ఉన్నాయి.

హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ, హెమటోపాథాలజీ, మెడికల్ ఆంకాలజీ, పల్లియేటివ్ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, సర్జికల్ ఆంకాలజీ, బయో కెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల్లో ఈఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాల లోపు ఉండాలి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ డిగ్రీ, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానికి సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 20, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://tmc.gov.in/index.php/en/ పరిశీలించగలరు.