CSR IMMT JOBS : సీఎస్ఆర్ ఐఎమ్ఎమ్ టీ లో ఉద్యోగాల భర్తీ

ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.20,000ల నుంచి రూ.42,000ల వరకు వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

CSR IMMT JOBS : సీఎస్ఆర్ ఐఎమ్ఎమ్ టీ లో ఉద్యోగాల భర్తీ

Csir Immt

Updated On : May 13, 2022 / 3:07 PM IST

CSR IMMT JOBS : భువనేశ్వర్‌లోని సీఎస్‌ఐఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మినరల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్‌ జేఆర్ఎఫ్‌ పోస్టులు 3 ఖాళీలు, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు 8 ఖాళీలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ పోస్టులు 2 ఖాళీలు, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టులు 4 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల వయోపరిమితి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.20,000ల నుంచి రూ.42,000ల వరకు వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం. ఎంపిక విధానం విషయానికి వస్తే ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.immt.res.in/ పరిశీలించగలరు.