RRB ALP CBAT Exam Date: RRB అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎగ్జామ్ ఎప్పుడంటే..
రెండవ దశ CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ CBAT రౌండ్‌కు హాజరు కావడానికి అర్హులు.

RRB ALP CBAT Exam Date: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) నియామకం 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) పరీక్ష తేదీని ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం జూలై 15న ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. సాధారణ షెడ్యూల్ ప్రకారం, RRB ALP CBAT అడ్మిట్ కార్డ్ పరీక్షకు నాలుగు రోజుల ముందు విడుదల చేయబడుతుంది. అయితే RRB ALP సిటీ ఇంటిమేషన్ స్లిప్ పరీక్షకు 10 రోజుల ముందు విడుదల చేయబడుతుంది. RRB ALP CBAT 2025 పరీక్ష ఫలితాల తేదీలు ఇంకా ప్రకటించబడలేదు. CBT 2 (70 శాతం వెయిటేజ్) , CBAT (30 శాతం వెయిటేజ్) నుండి మార్కులను కలిపి తుది మెరిట్ జాబితాను తయారు చేస్తారు.
రెండవ దశ CBTలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ CBAT రౌండ్‌కు హాజరు కావడానికి అర్హులు. ఆప్టిట్యూడ్ పరీక్ష.. అభ్యర్థుల రైలు ఆపరేషన్ పనులను నిర్వహించే సామర్థ్యాన్ని, అసిస్టెంట్ లోకో పైలట్ పాత్రకు వారి మానసిక అనుకూలతను అంచనా వేస్తుంది.
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లకు అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ ఉద్యోగాలను నియమించడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) RRB ALP, టెక్నీషియన్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులను ఆకర్షిస్తున్న జాతీయ స్థాయి పరీక్ష.
RRB ALP ఎంపిక ప్రక్రియ రెండు దశలను కలిగి ఉంటుంది (మొదటి దశ CBT, రెండవ దశ CBT). అదనంగా, ALPని ఎంచుకుని CBT 2లో అర్హత సాధించిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)లో ఉత్తీర్ణులు కావాలి. చివరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎంపానెలింగ్ ఉంటాయి. 7వ పే కమిషన్ మ్యాట్రిక్స్ (లెవల్ 2) ప్రకారం RRB ALPలకు ప్రారంభ వేతనం సుమారు రూ. 19వేలు.
Also Read: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. అద్భుతమైన ఉగ్యోగ అవకాశాలు.. ఫుల్ డీటెయిల్స్