CSL Apprentice Recruitment : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ
అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. వివరణాత్మక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఏదైనా ఒక ట్రేడ్‌లో ITI (నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ - NTC)లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటీస్ - ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (VHSE)లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

CSL Apprentice Recruitment
CSL Apprentice Recruitment : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 308 అప్రెంటిస్ లను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు.
READ ALSO : Safflower Cultivation : కుసుమలో అధిక దిగుబడుల కోసం సాగులో పాటించాల్సిన మెళకువలు
ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్ (జనరల్)/పెయింటర్ (మెరైన్), రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ మెకానిక్/రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్/ఆఫీస్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ సహా వివిధ విభాగాలలో ఈ అప్రెంటిస్ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. వివరణాత్మక నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఏదైనా ఒక ట్రేడ్‌లో ITI (నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ – NTC)లో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటీస్ – ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (VHSE)లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో, సంబంధిత ట్రేడ్‌లకు వర్తించే నిర్ణీత అర్హతలో పొందిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల షార్ట్-లిస్ట్ చేయబడుతుంది.
READ ALSO : Work From Home : మంచంపై నుండే ఆఫీసు కార్యకలాపాలతో ఆరోగ్య సమస్యలు
ఎంపికైన వారికి ITI ట్రేడ్ అప్రెంటీస్-₹ 8,000/, టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్-₹ 9,000/- నెలకు స్టైఫండ్ చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే వారికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం అక్టోబర్ 4, 2023 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://cochinshipyard.in పరిశీలించగలరు.