JOBS : ఏఎంయు లో టీచింగ్ పోస్టుల భర్తీ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీడీఎం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీహెచ్ డీ, నెట్ , స్లెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన లో అనుభవం కలిగి ఉండాలి.

Amu
JOBS : ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో పలు టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రొఫెసర్, డెరెక్టర్, అసిసోయేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అగ్రికల్చరల్ సైన్సెస్, ఆర్ట్స్ , కామర్స్, ఇంటర్నేషనల్ స్టడీస్, లా, లైఫ్ సైన్సెస్,సైన్స్ సోషల్ సైన్స్, థియాలజీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్ మెంట్ స్టడీస్ అండ్ రిసెర్చ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీడీఎం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీహెచ్ డీ, నెట్ , స్లెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు బోధన, పరిశోధన లో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు 30 జూన్ , 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.amu.ac.in/ పరిశీలించగలరు.