IBPS RRB : గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ ఖాళీల ధరఖాస్తుకు సమీపిస్తున్న తుదిగడువు !

దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ పాసైన వారిని అర్హులుగా నిర్ణయించారు. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లో ప్రతిభ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

IBPS RRB : గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగ ఖాళీల ధరఖాస్తుకు సమీపిస్తున్న తుదిగడువు !

IBPS RRB 2023

Updated On : June 19, 2023 / 11:47 AM IST

IBPS RRB : దేశంలోని రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఆమేరకు నియామక పరీక్ష కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. భర్తీ చేయనున్న పోస్టుల్లో క్లర్క్‌, పీఓ, ఆఫీసర్స్‌ స్కేల్‌ II, III స్థాయి పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,075 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి
దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Symptoms of Diabetes : వివిధ వయస్సుల వారిలో మధుమేహం లక్షణాలు ఏవిధంగా ఉంటాయంటే !

దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ పాసైన వారిని అర్హులుగా నిర్ణయించారు. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లో ప్రతిభ అధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Sickle Cell Disease : సికిల్ సెల్ వ్యాధి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందా? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

దరఖాస్తుల చేసుకునేందుకు జూన్ 21, 2023 తుది గడవుగా నిర్ణయించారు. దరఖాస్తుకుగాను ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌‌లకు రూ.175 ,ఇతరులకు రూ.850 చెల్లించాల్సి
ఉంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ibps.in/ పరిశీలించగలరు.