C-DAC Recruitment :సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంబీఏ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

C-DAC Recruitment :సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Vacancies in Center for Development of Advanced Computing

Updated On : December 13, 2022 / 8:27 PM IST

C-DAC Recruitment : కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పట్నా, సిల్‌చర్‌, గువాహటిలలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌)లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 మేనేజర్‌, ప్రిన్సిపల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అడ్మిన్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, మైక్రోప్రాసెసర్ అండ్‌ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, ఏఐ అండ్‌ లాంగ్వేజ్ కంప్యూటింగ్ మిషన్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్, డిపెండబుల్ అండ్ సెక్యూర్ కంప్యూటింగ్ మిషన్, జెన్‌నెక్ట్స్‌ అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంబీఏ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 56 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.16 లక్షల జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://careers.cdac.in/ పరిశీలించగలరు.