IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్)లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
వయోపరిమితి 18 -24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్‌సీఎల్)/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానానికి సంబంధించి రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Apprenticeships
IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్)లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిఫైనరీస్ డివిజన్ ట్రేడ్ & టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 1720 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Medigadda Project : మేడిగడ్డ ప్రాజెక్టు కుంగటంపై కేంద్ర కమిటీ నియామకం.. రేపు ప్రాజెక్టు పరిశీలన
ఖాళీల వివరాలకు సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్ అటెండెంట్ ఆపరేటర్: 421 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు బీఎస్సీ(భౌతిక శాస్త్రం, గణితం, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్(ఫిట్టర్): 189 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటిఐ(ఫిట్టర్ ట్రేడ్) ఉత్తీర్ణత ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ బాయిలర్(మెకానికల్): 59 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు బీఎస్సీ(భౌతిక శాస్త్రం, గణితం, కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి.
READ ALSO : MIDHANI Recruitment :హైదరాబాద్ మిధానిలో పలు పోస్టుల భర్తీ
టెక్నీషియన్ అప్రెంటిస్(కెమికల్): 345 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిప్లొమా(కెమికల్ ఇంజినీర్/ రిఫైనరీ &పెట్రో-కెమికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్(మెకానికల్): 169 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి డిప్లొమా(మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్(ఎలక్ట్రికల్): 244 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
READ ALSO : TDP MP Rammohan Naidu : సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం.. పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలి
టెక్నీషియన్ అప్రెంటీస్(ఇన్‌స్ట్రుమెంటేషన్): 93 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి డిప్లొమా(ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్&ఎలక్ట్రానిక్స్ /ఇన్‌స్ట్రుమెంటేషన్& కంట్రోల్ ఇంజినీర్) ఉత్తీర్ణత ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ (సెక్రటేరియల్ అసిస్టెంట్): 79 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి బీఏ/బీఎస్సీ/ బీకామ్ ఉత్తీర్ణత ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ (అకౌంటెంట్): 39 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి బీకామ్ ఉత్తీర్ణత ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్): 49 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ట్రేడ్ అప్రెంటిస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) (స్కిల్ సర్టిఫికెట్ హోల్డర్స్): 33 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఇంటర్ పాస్‌తో పాటు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌లో స్కిల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
READ ALSO : DGP Rajendranath Reddy: చంద్రబాబు లేఖపై దర్యాప్తు జరుగుతోంది.. టీడీపీ నేతల నిరసనలను ఎక్కడా అడ్డుకోలేదు
వయోపరిమితి 18 -24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్‌సీఎల్)/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానానికి సంబంధించి రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20.11.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;