NTPC Recruitment : నేషనల్ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్ ఉత్తీర్ణత సాధించిఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

NTPC Recruitment : నేషనల్ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

National Thermal Power Corporation Limited

Updated On : April 17, 2023 / 10:00 AM IST

NTPC Recruitment : నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. విభాగాల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో 12, మెకానికల్‌లో 30, కన్‌స్ట్రక్షన్,సివిల్‌ విభాగంలో 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Eggplant Cultivation : వంగసాగులో చీడపీడల బెడద! పాటించాల్సిన జాగ్రత్తలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్ ఉత్తీర్ణత సాధించిఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

READ ALSO : Papaya Cultivation : బొప్పాయి సాగులో యాజమాన్యం! తెగుళ్ల నివారణ

అభ్యర్థులను స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జీతంగా నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 21, 2023ని ఆఖరుతేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ntpc.co.in/ పరిశీలించగలరు.