Karnataka Polls: అంబేద్కర్ చెప్పినట్లు కాంగ్రెస్ నడుచుకోవడం లేదా? ఇంతకీ బీజేపీ విమర్శేంటి?
తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని హిమంత బిశ్వా శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉందని చెప్పారు

Karnataka Polls: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ నడుచుకోవడం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ విమర్శిస్తున్నారు. ఇంతకీ అంబేద్కర్ చెప్పిన దానికి కాంగ్రెస్ చేస్తున్నదానికి తేడా ఏంటని అనుకుంటున్నారా? భారత రాజ్యాంగంలో మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించలేదట. కానీ కాంగ్రెస్ పార్టీ మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని హిమంత విమర్శ.
రిజర్వేషన్లు మతం ఆధారంగా ఉండకూడదని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతోందని ఆయన అంటున్నారు. బాలాసాహెబ్ అంబేడ్కర్ చాలా స్పష్టంగా మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు కూడదని చెప్పినట్టు ఆయన వాదిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాష్ట్ర రాజధాని బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోలా ఉందని బిశ్వా శర్మ విమర్శించారు.
Maharashtra Politics: ఎన్సీపీ సీనియర్ నేత రాజీనామా.. ఆయన వెంటే బేరర్లంతా రాజీనామా
ఇస్లామిక్ సంస్థ పీఎఫ్ఐ, హిందూ సంస్థ బజరంగ్‍దళ్ సహా తదితర సంస్థలపై చట్టం ప్రకారం నిషేధం విధించేందుకు అవసరమైన నిర్ణయం తీసుకుంటామని మంగళవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇది రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా వివాదాస్పదమవుతోంది. బజరంగ్ భలిని నిషేధిస్తున్నారంటూ మోదీ నిప్పులు చెరిగారు. ఇక కాంగ్రెస్ హామీని తప్పు పడుతూ దేశ వ్యాప్తంగా బజరంగ్ దళ్ సహా రైట్ వింగ్ గ్రూపులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి.
Karnataka elections 2023: కాంగ్రెస్‌కు అదిరిపోయే కౌంటర్.. జై బజరంగ్ బలీ నినాదాలు చేసిన మోదీ.. వీడియో
అయితే తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కర్ణాటకలో యూసీసీని అమలు చేస్తామని హిమంత బిశ్వా శర్మ అన్నారు. దేశవ్యాప్తంగా యూసీసీ అమలును అంతా కోరుతున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) అవసరం కూడా ఇప్పుడు ఎంతో ఉందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న జరుగనుంది. అనంతరం 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.