Gujarat Polls: ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు.. కాంగ్రెస్‭పై విరుచుకుపడ్డ మోదీ

కాంగ్రెస్ పార్టీ లాగ కాకుండా ఉగ్రవాదం విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు సరిహద్దులు దాటాలంటే జంకుతున్నారని అన్నారు. 25 ఏళ్లలోపు యువతకు కర్ఫ్యూ ఏంటో కూడా తెలియదని, బాంబు దాడుల నుంచి వారిని కాపాడుకోగలిగామని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం విడ్డూరమని ఆయన చెప్పారు.

Gujarat Polls: ఉగ్రవాదులకు బదులు నన్ను టార్గెట్ చేశారు.. కాంగ్రెస్‭పై విరుచుకుపడ్డ మోదీ

Asked them to target terrorism, they targeted me says PM Modi takes dig at Congress

Updated On : November 27, 2022 / 9:03 PM IST

Gujarat Polls: దేశంలో ఉగ్రవాదాన్ని తరిమేయడానికి బదులు కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అంతే కాకుండా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ వాడుకుందని ఆరోపించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఖేడాలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రధాన అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్ వేళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉగ్రవాదులకు మద్దతుగా కన్నీళ్లు కార్చారు. ఉగ్రవాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంది. అనేక ఇతర పార్టీలు కూడా ఇలాంటి దారుణ చర్యలకు పాల్పడ్డాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూరత్, అహ్మదాబాద్‌లో పేలుళ్లు జరిగి ప్రజలు చనిపోతుంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని నేను కేంద్రాన్ని కోరాను. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది’’ అని మోదీ అన్నారు.

Iran Hijab: హిజాబ్ ధరించని కస్టమర్‌కు సర్వీస్ చేసిన బ్యాంక్ మేనేజర్.. విధుల్లోంచి తొలగించిన ఇరాన్ ప్రభుత్వం

కాంగ్రెస్ పార్టీ లాగ కాకుండా ఉగ్రవాదం విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు సరిహద్దులు దాటాలంటే జంకుతున్నారని అన్నారు. 25 ఏళ్లలోపు యువతకు కర్ఫ్యూ ఏంటో కూడా తెలియదని, బాంబు దాడుల నుంచి వారిని కాపాడుకోగలిగామని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం విడ్డూరమని ఆయన చెప్పారు.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తుంది. 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో గెలిచి ఆరోసారి అధికారంలోకి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో సైతం బీజేపీనే గెలుస్తుందని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి.

Meerut: దారుణానికి తెగబడ్డ విద్యార్థులు.. క్లాస్ రూంలోనే టీచర్‭పై లైంగిక వేధింపులు.. వీడియో తీస్తూ రాక్షసానందం