Yoga For Health: ఈ 5 యోగాసనాలతో కొలెస్ట్రాల్ మాయం.. గుండె సేఫ్.. మీరు కూడా తప్పకుండా చేయండి
Yoga For Health: యోగాసనాలు కూడా కొలెస్టరాల్‌ను నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. మరి ఇప్పుడు కొలెస్టరాల్ తగ్గించే ఐదు యోగాసనాలు గురించి వాటి లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం.

5 yoga poses that control cholesterol levels in the body
కొలెస్టరాల్ అనేది శరీరంలో సహజంగా ఏర్పడే కొవ్వు పదార్థం. ఇది కొన్ని హార్మోన్ల ఉత్పత్తికి, కణాల నిర్మాణానికి అవసరం. కానీ అధిక కొలెస్టరాల్ శరీరంలో పేరుకుపోతే హృదయ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన ఆహారం, వ్యాయామంతో పాటు యోగాసనాలు కూడా కొలెస్టరాల్‌ను నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. మరి ఇప్పుడు కొలెస్టరాల్ తగ్గించే ఐదు యోగాసనాలు గురించి వాటి లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం.
1.సర్వాంగాసనము:
ఈ ఆసనాన్ని ఎలా చేయాలంటే.. వెనకకు పరచుకొని పడుకోని. చేతులతో నడుమును అడ్డంగా పట్టుకుని కాళ్లను పైకి ఎత్తాలి. శరీరాన్ని భుజాల మీద నిలిపేట్టుగా పైకి లేపాలి. నాలుగు నుండి ఆరు శ్వాసలపాటు ఆ స్థితిలో ఉండాలి. ఇలా చేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితం అయ్యి మెటాబోలిజాన్ని పెంచుతుంది. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిని తగ్గుతుంది. రక్త ప్రసరణను మెరుగవుతుంది.
2.పవనముక్తాసనము:
ఈ ఆసనం ఎలా చేయాలంటే. వీపు మీద పడుకోని ఒకొక్క కాలిని మడిచి ఛాతీకి దగ్గరగా తేచి చేతులతో పట్టుకోవాలి. తలను పైకి ఎత్తి మోకాలు తాకేలా చేయాలి. రెండో కాళితోనూ ఇదే విధంగా చేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరచబడి చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. పొట్టపై ఒత్తిడి వల్ల అబ్డొమినల్ ఫ్యాట్ కరిగించడంలో ఉపయోగపడుతుంది.
3.భుజంగాసనము:
ముందు పొట్టమీద పడుకొని చేతులను భుజాల కింద ఉంచాలి. ఊపిరి పీల్చుకుంటూ భుజాల నుంచి నడుమువరకు పైకి లేపండి. రెండు కాళ్లు నేలపై సమాంతరంగా ఉంచాలి. కొన్ని సెకన్లపాటు అదే స్థితిలో ఉండాలి. ఇలా చేయడం వల్ల జిగురు, కిడ్నీ, గుండె వంటి అవయవాలపై మంచి ప్రభావం చూపుతుంది. కొవ్వు పదార్థాలను కరిగించడంలో సహాయపడుతుంది. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిని తగ్గిస్తుంది.
4.అర్ధ మత్స్యేంద్రాసనము:
ఈ ఆసనంలో ముందు నేలపై ఒక కాలు మరోక కాలి మీద క్రాస్ చేసి కూర్చోవాలి. విరుద్ధ వైపునకు చేతలను చుట్టుతూ మోకాలిపై పెట్టి మరో వైపు చూడాలి. కొన్ని సెకన్లపాటు ఆ స్థితిలో ఉండాలి. ఇలా మరో చేతితో కూడా చేయాలి. ఈ స్థితి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలేయం, పొట్ట, పాంక్రియాస్ వంటి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. కొలెస్టరాల్ స్థాయిని తగ్గిస్తుంది.
5.నౌకాసనము:
ఈ ఆసనంలో వీపు మీద పడుకొని చేతులు వెనక్కి ఉంచాలి. చేతులు, కాళ్లు రెండింటినీ భూమికి సమాంతరంగా పైకి ఎత్తాలి. శరీరం బోటు ఆకారంలో ఉండేలా చేయాలి. ఈ స్థితిలో 10 నుంచి 15 సెకన్లపాటు ఉండాలి. ఈ ఆసనం వేయడం వల్ల పొట్టపొరలో ఉన్న కొవ్వును కరుగుతుంది. గుండె,జీర్ణవ్యవస్థకు శక్తినిస్తుంది. మంచి కొలెస్టరాల్ పెరగడానికి, చెడు కొలెస్టరాల్ తగ్గడానికి సహాయపడుతుంది.
ఈ యోగాసనాలు రోజూ 20 నుంచి 30 నిమిషాలపాటు చేయడం ద్వారా కొలెస్టరాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచవచ్చు. అయితే మీరు ఇప్పటికే హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారైతే ఈ ఆసనాలు చేయడానికి ముందు డాక్టరు సలహా తీసుకోవాలి.