డెంగీ వచ్చిందా….పారాసిటమాల్‌ 650 ట్యాబ్లెట్ వేసుకోండి

  • Published By: veegamteam ,Published On : September 26, 2019 / 06:17 AM IST
డెంగీ వచ్చిందా….పారాసిటమాల్‌ 650 ట్యాబ్లెట్ వేసుకోండి

Updated On : September 26, 2019 / 6:17 AM IST

ప్రపంచవ్యాప్తంగా డెంగీ జ్వరలు ప్రజలను తీవ్రంగా వణికిస్తున్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. వందల సంఖ్యలో రోగులు డెంగీ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఉత్తరాఖండ్ లో దాదాపు 4,800 మందికి డెంగీ ఫీవర్‌ సోకినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డెహ్రాడూన్‌ ప్రాంతంలో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉందని.. మూడువేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు. 

డెంగీ తగ్గాలంటే వేసుకోవాల్సిన ట్యాబ్లెట్:
ఉత్తరాఖండ్‌ ను డెంగీ వణికిస్తున్న సందర్భంగా… ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. డెంగీ ఫీవర్‌ తగ్గకపోతే 500 ఎంజీకి బదులు, 650 ఎంజీ పారసిటమాల్‌ ట్యాబెట్లు వేసుకుని విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుందని రావత్‌ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో డెంగీ కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్టు గతవారం ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించగా.. సీఎం రావత్‌ మాత్రం నలుగురు వ్యక్తులే చనిపోయారని చెబుతున్నారు.  

అంతేకాదు గతంతో పోల్చితే ఈ సంవత్సరం డెంగీ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నాయని…అందుకే ELISE  పరీక్షను నిర్వహించడానికి మరిన్ని రోగనిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని.. భయపడాల్సిన అవసరం లేదని రావత్‌ తెలిపారు.