Dates Benefits: ఖర్జూరతో సూపర్ ఆరోగ్యం.. కానీ, ఈ చిన్న తప్పు మాత్రం అస్సలు చేయకండి
Dates Benefits: ఖర్జూరాల్లో సహజమైన చక్కెరలు, గ్లూకోజ్, ఫ్రుక్టోజ్, సుక్రోజ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

Health benefits of eating dates
ఈ భూమి మీద మనకు లంబించే స్వచ్ఛమైన శక్తివంతమైన ఆహారాలలో ఖర్జూరం ఒకటి. తియ్యగా ఉండే ఈ పదార్థం రుచిని మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించే పుష్కలమైన పోషక గుణాలను కలిగి ఉంటుంది. దాదాపుగా ప్రతి వయసు వారికీ ఇది అనుకూలంగా ఉంటుంది. అందుకే మనరోజు వారి ఆహారంలో దీనిని చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల రోగాల వారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే, ఖర్జూరం తినే విషయంలో తెలియకుండా చేసే కొన్ని తప్పులు ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. మరి ఆ తప్పులు ఏంటి? ఖర్జూరంను ఎలా తీసుకంటే మంచిది అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఖర్జూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
1.శక్తి పెరుగుతుంది:
ఖర్జూరాల్లో సహజమైన చక్కెరలు, గ్లూకోజ్, ఫ్రుక్టోజ్, సుక్రోజ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ఇది వ్యాయామం తర్వాత తీసుకోవడం మంచిది.
2.జీర్ణక్రియ మెరుగవుతుంది:
ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
3.హృదయ ఆరోగ్యానికి మంచిది:
ఖర్జూరంలో పొటాషియం, మ్యాగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
4.అంతర్గత శరీర శుద్ధి (డీటాక్సిఫికేషన్):
ఖర్జూరం యాంటీ ఆక్సిడెంట్లు (antioxidants) తో నిండి ఉంటుంది. ఇది శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో మెరుగా పనిచేస్తుంది.
5.హెమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది:
ఖర్జూరంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత (అనీమియా)ని తగ్గిస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది.
6.ఎముకల దృఢత్వం:
ఖర్జూరంలో కాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి.
ఖర్జూరం తినేటప్పుడు చేసే సాధారణ తప్పులు
1.అధిక పరిమాణంలో తినడం:
ఖర్జూరం తీపిగా ఉండడం వల్ల చాలా మంది ఇష్టపడతారు. ఎక్కువగా తింటారు. కానీ ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పండు. కాబట్టి, ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉంటుంది. వైద్యుడి సలహామేరకు రోజుకు 3 నుంచి 5 ఖర్జూరాలు తినడం మంచిది.
2.చెడు ఉత్పత్తులను కొనడం:
మార్కెట్లో రసాయనాలతో ప్రాసెస్ చేసిన ఖర్జూరాలు ఎక్కువగా లభిస్తున్నాయి. వీటిని తినడం వలన లాభం కన్నా నష్టం ఎక్కువ. ప్రకృతిసిద్ధంగా లభించే ఖర్జూరాలను (organic dates) కొనాలి. పెద్దగా మెరిసిపోయే ఖర్జూరాలను తినడం ప్రమాదం.
3.రాత్రి ఎక్కువగా తినడం:
రాత్రిపూట చాలా మందికి భోజనం తరువాత తీపి తినే అలవాటు ఉంటుంది. అందుకే చాలా మంది ఖర్జూర తింటారు. కానీ, ఇది శరీరంపై భారం వేయవచ్చు. కాబట్టి ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తినడం మంచిది.
4.చక్కెర పదార్థాలతో కలిపి తినడం:
కొంతమంది ఖర్జూరను పైన చక్కెర పొడి చల్లి లేదా తీపి పదార్థాల్లో కలిపి తింటారు. ఇలా చేయడం వల్ల ఖర్జూరం ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి. సహజ స్వరూపంలోనే ఖర్జూరను తినాలి.