Brown Rice Benefits: మీకు తెలుసా? బ్రౌన్ రైస్ తో బోలెడు లాభాలు.. షుగర్, గుండె, మెదడు సర్వం నయం

Brown Rice Benefits: బ్రౌన్ రైస్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మలబద్ధక సమస్యను నయం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Brown Rice Benefits: మీకు తెలుసా? బ్రౌన్ రైస్ తో బోలెడు లాభాలు.. షుగర్, గుండె, మెదడు సర్వం నయం

Health benefits of eating brown rice every day

Updated On : August 7, 2025 / 5:17 PM IST

ప్రస్తుతకాలంలో ప్రజలందరూ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకోసం వ్యాయామాలు, యోగాలు చేస్తున్నారు. అలాగే రోజు తీసుకునే ఆహరంలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో బ్రౌన్ రైస్ (Brown Rice) ప్రముఖమైనది. ఇది పాలిష్ చేయని, సహజ రూపంలో ఉండే బియ్యం. బ్రౌన్ రైస్ అంటే తెల్ల బియ్యాన్ని పోలినప్పటికీ, ఇది దాని చిప్పను తొలగించకుండా ఉంచిన బియ్యం. ఆ చిప్పలోనే మక్కువైన పోషక విలువలు వున్నాయి. కాబట్టి, ఇది మన ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తుంది. మరి అలాంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

బ్రౌన్ రైస్ లోని ముఖ్యమైన పోషకాలు:

  • ఫైబర్ (Fiber)
  • మెగ్నీషియం (Magnesium)
  • ఫాస్ఫరస్ (Phosphorus)
  • సెలీనియం (Selenium)
  • బి విటమిన్స్ (Vitamin B1, B3, B6)
  • మెanganese (మాంగనీస్)
  • ఆయరన్, జింక్

బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1.జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం:
బ్రౌన్ రైస్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మలబద్ధక సమస్యను నయం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని బయటకు పంపిస్తుంది. మొత్తంగా జీర్ణ వ్యవస్థను సమన్వయం చేస్తుంది.

2.రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణ:
ఈ మధ్య కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అలాంటి వైట్ రైస్ తినకూడదు. వారికి బ్రౌన్ రైస్‌ మంచి ఆప్షన్. ఎందుకంటే, బ్రౌన్ రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. కాబట్టి, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది.

3.గుండె ఆరోగ్యాన్ని కాపాడడం:
బ్రౌన్ రైస్‌లో ఫైబర్, లిగ్నాన్స్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అలాగే ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ని పెంచుతుంది. కాబట్టి, గుండె సమస్యలు, హై బీపీ వంటి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

4.బరువు తగ్గేందుకు సహాయపడుతుంది:
బ్రౌన్ రైస్ లో కాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇది ఎక్కువ సమయం ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా ఆకలి తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది.

5.క్యాన్సర్ నివారణలో సహాయపడే గుణాలు:
బ్రౌన్ రైస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ లది ముఖ్యమైన కలయిక. ఇది కొలాన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్లను నివారించగల శక్తి కలిగి ఉంటాయి. ఫలితంగా క్యాన్సర్ వ్యతిరేక రోగ నిరోధకత పెరుగుతుంది.

6.ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు:
బ్రౌన్ రైస్‌లో బి విటమిన్లు, జింక్, శక్తినిచ్చే మాంగనీస్ అధికంగా లభిస్తాయి. ఇది చర్మానికి, జుట్టుకి సహజమైన ఆరోగ్యాన్ని కాంతి అందిస్తాయి.