International Yoga Day: అసలు యోగా ఎందుకు చేయాలి? మీ ప్రశ్నకు సమాధానం ఇదిగో..

Yoga: యోగ అనేది శరీరానికి వ్యాయామం మాత్రమే కాదు, మనసుకు శాంతి, ఆత్మకు జ్ఞానం అందించే అద్భుతమైన మార్గం.

International Yoga Day: అసలు యోగా ఎందుకు చేయాలి? మీ ప్రశ్నకు సమాధానం ఇదిగో..

Yoga day special

Updated On : June 21, 2025 / 10:30 AM IST

యోగ అనేది మనిషి జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, సాత్వికంగా తీర్చిదిద్దే ఒక శక్తివంతమైన సాధనం. ఇది శరీరానికి వ్యాయామం మాత్రమే కాదు, మనసుకు శాంతి, ఆత్మకు జ్ఞానం అందించే అద్భుతమైన మార్గం. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఒక 30 నిమిషాలు యోగానికి కేటాయించాలి. దీనివల్ల మనుషులు నయం చేయలేని ఎన్నో సమస్యలను నయం చేయవచ్చు. కానీ, ప్రస్తుత సమాజంలో యోగ యోక్క ప్రాముఖ్యతను మర్చిపోయారు. ముందు చెప్పినట్టుగానే యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు జీవన విధానం. భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలితంగా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు యోగ అవసరాన్ని విశ్వవ్యాప్త ప్రాముఖ్యతను తెలియజేయడానికి. “యోగ ఫర్ వెల్-బీయింగ్” అనే నేపథ్యంతో మొదలైన ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది.

యోగ యొక్క 8 అంగాలు (అష్టాంగ యోగం):

యోగలో మొత్తం 8 అంగాలు ఉంటాయి. ఇవి మానసిక, శారీరక, ఆధ్యాత్మిక వంటి విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిలో మొదటిది.

యమ: నైతిక నియమాలు (అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం)

నియమ: వ్యక్తిగత నియమాలు (శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఇశ్వరప్రణిధానం)

ఆసన: శరీరాన్ని స్థిరంగా ఉంచే స్థితులు

ప్రాణాయామం: యోగ అనేది శ్వాస నియంత్రణ

ప్రత్యాహారం: ఇంద్రియాలను అంతర్గతంగా మలచడం

ధారణా: ఏకాగ్రత

ధ్యానం: మౌనంగా మనస్సును స్థిరంగా ఉంచడం

సమాధి: తుదకి ఆత్మతో ఐక్యమవడం

యోగ ప్రయోజనాలు:

శారీరక ప్రయోజనాలు: యోగ శరీర ధారుణ్యాన్ని తగ్గించి కండరాలను బలోపేతం చేస్తుంది. దీనివల్ల వశ్యత పెరుగుతుంది. యోగ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణ, గుండె సమస్యలు, నాడీ వ్యవస్థను మెరిగిపరుస్తుంది.

మానసిక ప్రయోజనాలు: యోగ ఒత్తిడిని నియంత్రిస్తుంది. మానసిక స్పష్టతను ఏకాగ్రతను పెంచుతుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మవిమర్శ పెరుగుతుంది.

ఆధ్యాత్మిక ప్రయోజనాలు: ధ్యాన సాధన వల్ల లోతైన తత్వచింతన ఏర్పడుతుంది. తాత్కాలికమైన వాటిపై వ్యామోహం తగ్గిపోతుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మను” అనే జ్ఞానం కలుగుతుంది. ఇది బ్రహ్మజ్ఞానానికి దారి తీస్తుంది.

యోగ జీవన మార్గం:

యోగ అనేది ఒక జీవన మార్గం, ఒక తత్వం, ఒక మార్పు.
మనిషి తన అసలైన స్వరూపాన్ని గుర్తించుకునే మార్గం.
ఈ ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా మనందరం యోగాని జీవన శైలిలో భాగం చేసుకుందాం.