కరోనాపై కేరళ ఫైట్.. జైల్లో ఖైదీలతో మాస్క్‌ల తయారీ, ఇంటికే మధ్యాహ్న భోజనం!

  • Published By: sreehari ,Published On : March 18, 2020 / 06:25 AM IST
కరోనాపై కేరళ ఫైట్.. జైల్లో ఖైదీలతో మాస్క్‌ల తయారీ, ఇంటికే మధ్యాహ్న భోజనం!

Updated On : March 18, 2020 / 6:25 AM IST

దక్షిణాది రాష్ట్రమైన కేరళ ప్రాణాంతక కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తిని తిప్పికొడుతోంది. సరైన సమయంలో వ్యాప్తిని కంట్రోల్ చేయడమే కాకుండా అవసరమైన ప్రతిచోట చర్యలను వేగవంతం చేయడంలో కేరళ ప్రభుత్వం ముందంజలో నిలిచింది. కరోనా వ్యాప్తిని అదుపుచేసే క్రమంలో కేరళ.. ఫేస్ మాస్క్ ల కొరతపై దృష్టిసారించింది. మాస్క్‌లను కుట్టించి పంపిణీ చేస్తోంది. ప్రత్యేకించి కేరళలోని జైల్లో ఖైదీల సాయంతో మాస్క్ ల కొరతపై దృష్టి పెట్టింది.

మాస్క్‌ల కొరత కారణంగా కేరళలో జైల్లో టైలరింగ్ యూనిట్లను వినియోగించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మాస్క్‌ల డిమాండ్ మేరకు ప్రత్యేకించి కరోనా మాస్క్ లను కుట్టించి పంపిణీ చేస్తోంది. మధ్యాహ్న భోజనాన్ని నేరుగా ఇంటికే పంపడం వంటి ఏర్పాట్లు చేస్తోంది. తిరువనంతపురంలో టైలర్ స్టిచ్చింగ్ యూనిట్లను ఏర్పాటు చేసింది. కన్నూర్, వయ్యూర్ సెంట్రల్ జైల్లో ఖైదీలు ఫేస్ మాస్క్ లను తయారుచేసే కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇదే తరహాలో ఇతర జైల్లు కూడా మాస్క్ లను కుట్టించి పంపిణీ చేయనున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్ బుక్ పోస్టులో.. కరోనా వైరస్ వ్యాప్తిపై పోరాటం చేస్తున్నామని, జైలు ఖైదీలు కూడా ప్రభుత్వంతో చేతులు కలిపి కరోనాను తరిమికొట్టేందుకు సాయం చేస్తున్నారు’ అని పోస్టు పెట్టారు.

గతవారమే కేరళ ప్రభుత్వం కేరళ స్టార్టప్ మిషన్ భాగస్వామ్యంతో ఒక మొబైల్ యాప్ రూపొందించింది. కరోనా వైరస్ వ్యాప్తిని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ యాప్ వినియోగిస్తోంది. ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే ఈ యాప్ ద్వారా నిజమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తోంది.

కరోనా వ్యాప్తిపై వస్తున్న పుకార్లను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ యాప్ ప్రవేశపెట్టింది. కాలేజీలు, స్కూళ్లను మూసివేశారు. అంగనవాడీ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనాన్ని పిల్లల ఇంటిదగ్గరకు పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో నెట్ వర్క్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా మెరుగైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ సౌకర్యాన్ని అందించేలా కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

See Also | భారతదేశానికి కాలసర్ప దోషం : కరోనా కట్టడికి శ్రీ శారదా పీఠంలో యాగం