Hepatitis: వర్షాకాలంలో హెపటైటిస్ ప్రమాదం.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.. జాగ్రత్తగా ఉండండి

Hepatitis: వర్షాల కారణంగా వరద నీరు, మురుగు నీరు త్రాగునీటి ట్యాంకులకు, బావులలోకి చేరుతుంది.

Hepatitis: వర్షాకాలంలో హెపటైటిస్ ప్రమాదం.. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.. జాగ్రత్తగా ఉండండి

Precautions to be taken to avoid hepatitis during the rainy season

Updated On : July 28, 2025 / 11:40 AM IST

వర్షాకాలం అంటేనే అనేక ఆరోగ్య సమస్యలకు మూలంగా మారుతుంది. వాటిలో ముఖ్యంగా వైరల్ వ్యాధులు విజృంభిస్తాయి. వీటిలో హెపటైటిస్‌ (Hepatitis) ఒకటి. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. మానవ శరీరంలో ఇది ప్రధానంగా కాలేయాన్ని (liver) ప్రభావితం చేస్తుంది. కాలేయం, ఆరోగ్య విషయంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి కాలేయ ఆరోగ్యం అనేది చాలా ప్రధానం. ముఖ్యంగా వర్షాకాలంలో హెపటైటిస్‌ A మరియు E వైరస్‌లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. మరి కాలేయాన్ని హెపటైటిస్ నుంచి ఎలా రక్షించుకోవాలి? హెపటైటిస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

వర్షాకాలంలో హెపటైటిస్ వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన కారణాలు:

కలుషితమైన త్రాగునీరు:
ఈ కాలంలో వర్షాల కారణంగా వరద నీరు, మురుగు నీరు త్రాగునీటి ట్యాంకులకు, బావులలోకి చేరుతుంది. ఇలాంటి నీటిని తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కలుషితమైన నీటి తాగడం వల్ల హెపటైటిస్ A/E వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.

అపరిశుభ్రమైన ఆహారం:
వర్షాకాలంలో ఎక్కువ తేమ ఉండటం వలన ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా పెరుగుతాయి. బహిరంగంగా అమ్మే ఆహారాలు, తడిగా ఉండే స్నాక్స్‌ వంటి వాటి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.

వ్యక్తిగత పరిశుభ్రత:
ఈ కాలంలో వాతావరణం తడిగా ఉంటుంది. కాబట్టి ఇంటి పరిసరాలు కూడా పాదనగా చెత్తగా తయారవుతాయి. ఇలాంటి ప్రదేశాల్లో తిరగటం, చేతులు కడుక్కోకుండా ఆహారం తినటం వంటివి చేయడం వల్ల వైరస్ వ్యాప్తికి దోహదపడుతుంది.

నీటి నిల్వల పరిరక్షణ లోపం:
మన రోజు వాడుకునే నీటి నిల్వలపై మూతల లేకపోవడం, వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది.

హెపటైటిస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • శుభ్రమైన త్రాగునీరు(కాచి వడబోసిన నీరు)
  • ఎప్పటికీ మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటినే తాగాలి.
  • వర్షకాలంలో ఓఆర్‌ఎస్ (ORS) వంటి పదార్థాలు కూడా ఉపయోగించటం మంచిది.

ఆహార పరిశుభ్రత ప్రధానం:

  • చల్లగా నిల్వపెట్టిన, తాజాగా తయారుచేసిన ఆహారాన్నే మాత్రమే తీసుకోవాలి.
  • బయట అమ్మే అశుభ్రమైన ఆహారాన్ని పూర్తిగా నివారించాలి.

వ్యక్తిగత పరిశుభ్రత:

  • ప్రతిసారి భోజనానికి ముందు, తరువాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
  • మానవ వ్యర్థాల వ్యాప్తిని నివారించి మంచి పారిశుద్ధ్యం పాటించాలి.

టీకాలు తీసుకోవడం:

  • హెపటైటిస్ A మరియు B కి వ్యతిరేకంగా టీకాలు అందుబాటులో ఉన్నాయి.
  • వైద్య సలహాతో వాటిని ముందుగానే వేయించుకోవచ్చు.

నీటి నిల్వల పరిశుభ్రత:

  • నీటి ట్యాంకులు, డ్రమ్ములు మొదలైన వాటిని తరచూ శుభ్రం చేయాలి.
  • వాటిపై ఎప్పుడూ మూత ఉండేలా చూడాలి.

వర్షాకాలంలో అనేక వ్యాధులు విస్తరించే అవకాశం ఉంది. వాటిలో హెపటైటిస్ చాలా ప్రమాదకరమైనది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని పూర్తిగా నివారించవచ్చు. పరిశుభ్రత, శుద్ధమైన నీటి వినియోగం, ఆరోగ్యకరమైన ఆహారం అనే మూడింటిపై శ్రద్ధ పెడితే మనం ఆరోగ్యంగా ఉండగలము.