Haipar Tension: హైపర్ టెన్షన్ చాలా డేంజర్.. మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.. జాగ్రత్త పడకపోతే ప్రాణాపాయం తప్పదు
Haipar Tension: హైపర్ టెన్షన్ అంటే "అధిక రక్తపోటు" అని అర్థం. మన గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది.

Precautions to be taken to reduce hypertension
హైపర్ టెన్షన్ అంటే “అధిక రక్తపోటు” అని అర్థం. మన గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపుతుంది. ఈ సమయంలో రక్తం ధమనుల్లో (arteries) ఒక ఒత్తిడి కలిగిస్తుంది. ఆ ఒత్తిడి ఒక స్థాయి కంటే ఎక్కువగా ఉన్నపుడు దానిని హైపర్ టెన్షన్ అంటారు. సాధారణంగా ఆరోగ్యవంతుల రక్తపోటు 120/80 mmHg గా ఉండాలి. ఇందులో 120 సిస్టోలిక్ గుండె రక్తాన్ని పంపే సమయంలో ఉండే ఒత్తిడి, 80 డియాస్టోలిక్ గుండె విశ్రాంతిలో ఉండే ఒత్తిడి. ఇది 140/90 mmHg, అంతకంటే ఎక్కువగా ఉన్నపుడు అది హైపర్ టెన్షన్ గా పరిగణించబడుతుంది.
హైపర్ టెన్షన్ రావడానికి కారణాలు ఏంటి?
1.ప్రాథమిక హైపర్ టెన్షన్:
ఇది ఎక్కువ మందిలో కనిపించే లక్షణం. దీనికి స్పష్టమైన కారణాలు లేవు. సాధారణంగా వయస్సు పెరగడం, వంశపారంపర్యం, జీవనశైలి వచ్చిన మార్పుల కారణంగా ఇది వచ్చే ప్రమాదం ఉంది.
2.ద్వితీయ హైపర్ టెన్షన్:
ఇది కొన్ని ఇతర ఆరోగ్య సమస్యల వల్ల తలెత్తుతుంది. ఉదాహరణకు కిడ్నీ సమస్యలు థైరాయిడ్, అడ్రినల్ గ్రంధి సమస్యలు, నిద్రలో శ్వాస ఆగిపోవడం, మద్యం ఎక్కువగా సేవించడం, ధూమపానం, కొంతమంది మందుల దుష్ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది.
హైపర్ టెన్షన్ లక్షణాలు:
హైపర్ టెన్షన్ చాలా సందర్భాల్లో లక్షణాలు చూపదు. అందుకే దీన్ని నిశ్శబ్ద హంతకుడు (Silent Killer) అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కనిపించే ప్రధానమైన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:
- తలనొప్పి
- గుండె వేగంగా కొట్టుకోవడం
- ముక్కు రక్తం
- చూపు మసకబారడం
- అలసట
హైపర్ టెన్షన్ వల్ల కలిగే ప్రమాదాలు:
- గుండె జబ్బులు
- బ్రెయిన్ స్ట్రోక్
- కిడ్నీ సమస్యలు
- చూపు తగ్గిపోవడం
- ధమనుల గట్టిపడటం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి:
మనరోజు వారి ఆహరంలో మార్పుల వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉప్పు, కారం తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి తక్కువ కొలెస్ట్రాల్ కలిగిన ఆహారం తీసుకోవాలి, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.
2.నిత్యం వ్యాయామం:
హైపర్ టెన్షన్ కి మంచి మెడిసిన్ అంటే వ్యాయామం అనే చెప్పాలి. రోజు కనీసం 30 నిమిషాలు నడక లేదా యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి. అలాగే శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
3.ధూమపానం, మద్యపానం మానివేయాలి:
పొగతాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా వరకు హాని చేస్తాయి. ఇవి మెదడు, గుండె, నరాలు వంటి వాటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
4.ఒత్తిడి నియంత్రణ:
మానసిక ఒత్తిడి కారణంగా మెదడు, గుండెపై ప్రభావం పడుతుంది. ఇది క్రమంగా హైపర్ టెన్షన్ కి దారి తీస్తుంది. కాబట్టి, రోజు ధ్యానం, ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల విశ్రాంతి, నిద్ర సమయానికి పూర్ణ విశ్రాంతి పొందడం జరుగుతుంది.
5. రక్తపోటు మానిటరింగ్:
రక్తపోటు ను తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం మంచిది.
హైపర్ టెన్షన్ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. దీన్ని తొందరగా గుర్తించి, సరైన ఆహారం, వ్యాయామం, మందులతో నియంత్రించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి నిత్యం మీ రక్తపోటు స్థాయిలను తెలుసుకుంటూ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించడం మంచిది.