హైదరాబాద్‌లో డెంగ్యూతో మరొకరి మృతి

హైదరాబాద్‌లో డెంగ్యూతో మరొకరి మృతి

Updated On : September 14, 2019 / 4:28 AM IST

డెంగ్యూ జ్వరాలతో హైదరాబాద్ వణికిపోతోంది. పది రోజుల్లో నాలుగో వ్యక్తి డెంగ్యూ బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రవీణ్ కుమార్ బెకూ అనే కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి తీవ్రమైన జ్వరంతో సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చేరాడు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ అతని పరిస్థితి అదుపుకాలేదు. మంగళవారం నాటికి జ్వరం నియంత్రించలేకపోయారు. 

‘అతని అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిలవడం మొదలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ప్లేట్ లెట్ కౌంట్ పూర్తిగా పడిపోయి 20వేల కంటే తక్కువ స్థాయికి చేరింది. డెంగ్యూ అని తెలిసినప్పటి నుంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నా మంగళవారం ఉదయం 6గంటల 10నిమిషాలకు ప్రాణాలు కాపాడలేకపోయాం’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

డెంగ్యూ బాధితుల్లో నోరు, ముక్కులో నుంచి రక్తం, పల్స్ పడిపోవడం, శ్వాస అందుకోలేకపోవడం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అవయవాలు ఫెయిలవడంతో రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌లో డెంగ్యూ కారణంతో 13ఏళ్ల జాన్ విన్‌స్టన్, 5ఏళ్ల కె.రుత్విక మరో ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స్ తీసుకుంటూ మరణించారు. 

హైదరాబాద్ మొత్తంలో జనవరి 1నుంచి సెప్టెంబర్ 8వరకూ 3వేల 670కేసులు ఉన్నాయని గుర్తించినా అధికారికంగా ఎటువంటి రికార్డులు నమోదుకాలేదు.