బ్లేడుతో పనిలేదు: రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్‌బై

న‌టుడిగా, నిర్మాత‌గా సినిమా ఇండ‌స్ట్రీలో రాణించిన బండ్ల గ‌ణేష్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్నసంగ‌తి తెలిసిందే.

  • Published By: vamsi ,Published On : April 5, 2019 / 03:58 AM IST
బ్లేడుతో పనిలేదు: రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్‌బై

Updated On : April 5, 2019 / 3:58 AM IST

న‌టుడిగా, నిర్మాత‌గా సినిమా ఇండ‌స్ట్రీలో రాణించిన బండ్ల గ‌ణేష్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్నసంగ‌తి తెలిసిందే.

న‌టుడిగా, నిర్మాత‌గా సినిమా ఇండ‌స్ట్రీలో రాణించిన బండ్ల గ‌ణేష్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కండువా కప్పుకున్నసంగ‌తి తెలిసిందే. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయ‌న‌కి నిరాశే ఎదురైంది. టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న బండ్ల గ‌ణేష్ తాను రాజ‌కీయాల నుండి త‌ప్పుకుంటున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.
Read Also : నంబర్ ప్లేటు మారితే బుక్కైపోతారు

నా వ్యక్తిగత కారణాల తో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు. అంటూ ట్విట్టర్ ద్వారా బండ్ల గణేష్ ప్రకటించారు.

అలాగే.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను. అంటూ మరో ట్వీట్ చేసిన బండ్ల గణేష్.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. తెలంగాణ ఎన్నికలవేళ కేసిఆర్‌పైన టీఆర్ఎస్ పైన విమర్శలు ఎక్కుపెట్టిన బండ్ల గణేష్ ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే బండ్ల గణేష్‌కు టిక్కెట్ దక్కలేదు.

Read Also : కుప్పంలో జగన్: బీసీ సీటు గుంజుకున్నాడు.. చంద్రబాబుపై గెలిపిస్తే మంత్రిని చేస్తా