చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి
నగరంలోని చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన చార్మినార్ పెచ్చులు ఊడిపోయాయి. ఏక్ మినార్ పెచ్చులు ఊడిపడడంతో స్థానికులు భయపడ్డారు.

నగరంలోని చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన చార్మినార్ పెచ్చులు ఊడిపోయాయి. ఏక్ మినార్ పెచ్చులు ఊడిపడడంతో స్థానికులు భయపడ్డారు.
నగరంలోని చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన చార్మినార్ పెచ్చులు ఊడిపోయాయి. ఏక్ మినార్ పెచ్చులు ఊడిపడడంతో స్థానికులు భయపడ్డారు. ఇటీవలే ఆర్కియాలజీ శాఖ మరమ్మత్తులు చేపట్టింది. కొత్త హంగులతో దర్శనమిస్తోంది చార్మినార్. దీంతో పర్యాటకుల సంఖ్య అధికమౌతోంది. ఈ తరుణంలో మే 01వ తేదీ బుధవారం రాత్రి పెచ్చులు ఊడిపడడం ఆర్కియాలజీ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పెచ్చులు ఊడిపడడంతో దీనిని చూడటానికి భారీగా జనాలు వచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే రంజాన్ మాసం ప్రారంభం కానుంది. చార్మినార్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోతుంటాయి. శతాబ్దాల క్రితం నిర్మించిన చార్మినార్ కట్టడాన్ని.. పునరుద్దరించి..సుందరీకరించారు. పెచ్చులు ఊడటంతో అధికార్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
Also Read : మహర్షి ట్రైలర్ : ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా