ఎక్కే ముందు ఓ రేటు దిగాక మరో రేటు : Ola, Uber యాప్ గందరగోళం

నగరంలో ఓలా, ఉబెర్ యాప్‌లో ప్రయాణించే వారి జేబు గుల్లవుతోంది. ప్రయాణికుడి ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా..డ్రైవర్ ఫోన్‌లోని యాప్‌లో ఛార్జీలు చూపిస్తుండడంతో గందరగోళ పరిస్థితులకు కారణమౌతోంది. దీనివల్ల వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణీకులు, డ్రైవర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎక్కే ముందు ఓ రేటు..దిగాక మరో రేటు చూపిస్తోంది.
MG రోడ్ నుండి ఆటోనగర్‌కు వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అతని మొబైల్ యాప్‌లో రూ. 344.30గా చూపించింది. క్యాబ్ ఎక్కేసి గమ్యస్థానంలో దిగాడు. డ్రైవర్ తన మొబైల్ యాప్‌లో నమోదైన విధంగా రూ. 1120.18 చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో ప్రయాణికుడు ఖంగుతిన్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలా ఒక్కరికే కాదు..ఎంతో మందికి ఇలా జరుగుతోంది.
ఓలా మనీ నుండి చెల్లించేందుకు అవకాశం ఉంది. దీనికి డ్రైవర్లు నో అంటున్నారు. నేరుగా డబ్బులు ఇవ్వాలని..తమ అకౌంట్‌లోకి డబ్బులు రావడం లేదని డ్రైవర్లు అంటున్నారు. డ్రైవర్లు చేసిన డిమాండ్ మేరకు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని పలువురు ప్రయాణీకులు వెల్లడిస్తున్నారు.
ఈ విషయాలు సంబంధింత ఈ సంస్థలకు తెలిసినా సైలెన్స్‌గా వ్యవహరిస్తున్నాయి. ప్రయాణీకులే ఎక్కువగా నష్టపోతున్నారు. ఎలాంటి మార్పులు..చేర్పులు ఉన్నా..వినియోగదారుల మొబైల్ యాప్‌లతో పాటు డ్రైవర్ల మొబైల్ యాప్‌లో కూడా నమోదు కావాలి. కానీ అలా జరగడం లేదు. టెక్నికల్ ప్రాబ్లం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. రద్దీ లేని పగటి వేళల్లోనూ సమస్యలు తలెత్తుతున్నాయని కస్టమర్లు కంప్లయింట్స్ చేస్తున్నారు.