నిర్ణీతకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
ప్రగతి భవన్ లో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

ప్రగతి భవన్ లో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో సాగు, తాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. ఈమేరకు ప్రగతి భవన్ లో సాగునీటి ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షించారు. ప్రాజెక్టులకు కేటాయించాల్సిన నిధుల అంశంపై అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్ బిల్లు వంటి తదితర అంశాలపై చర్చ చేపట్టారు. నిర్ణీతకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.