ఓటు వేయడానికి వస్తే బేడీలు
ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఇప్పటి వరకు పోలీసులకు, ఇతర శాఖకే పరిమితమైన ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఇప్పటి వరకు పోలీసులకు, ఇతర శాఖకే పరిమితమైన ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఒక మున్సిపాలిటిలో యాప్ ను ప్రయోగాత్మకంగా ఉపయోగించి దొంగ ఓట్లను అరికట్టాలని భావిస్తుంది.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఉపయోగిస్తున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. ఈ పని కోసం ఈ 10 పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రత్యేక పోలింగ్ ఆఫీసర్ అదనంగా ఉండనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ తో పాటు వీడియో రికార్డింగ్ చేస్తామని, వెబ్ కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జర్వర్లు ఉంటారని ఈసీ తెలిపింది.
మున్సిపల్ ఎన్నికల కోసం 44వేల మంది ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు పోలీసులు విధుల్లో ఉంటారని, ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తెలుపు రంగు బ్యాలెట్ పేపర్‌ను వాడుతున్నట్లు వెల్లడించారు.