కాలుష్యానికి చెక్: స్వచ్ఛగాలిని అందించనున్న GHMC

ప్రధాన కూడళ్లలో 100 ఎయిర్  ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనుంది జీహెచ్ఎంసీ. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను 500వరకూ పెంచే యోచనలో ఉన్నారు. 

కాలుష్యానికి చెక్: స్వచ్ఛగాలిని అందించనున్న GHMC

Updated On : October 31, 2019 / 4:02 AM IST

ప్రధాన కూడళ్లలో 100 ఎయిర్  ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనుంది జీహెచ్ఎంసీ. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను 500వరకూ పెంచే యోచనలో ఉన్నారు. 

హైదరాబాద్ మహానగరాన్ని మరింత తీర్చిదిద్దేందుకు, నగరవాసులకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రధాన కూడళ్లలో 100 ఎయిర్  ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేయనుంది జీహెచ్ఎంసీ. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యను 500వరకూ పెంచే యోచనలో ఉన్నారు. 

ఇప్పటికే దేశంలో రద్దీగా ఉండే పలు నగరాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. కార్బన్ మొనాక్సైడ్, హైడ్రో కార్బన్స్ ఎక్కువగా ఉండి వాతావరణాన్ని పాడుచేస్తున్నాయి. అయితే ఈ ప్యూరిఫైయర్స్ ద్వారా స్వచ్ఛమైన గాలిని అందించాలనుకుంటున్న జీహెచ్ఎంసీ ముందుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిగ్నల్స్ వద్ద ఉంచాలనుకుంటున్నారు. 

జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మాట్లాడుతూ.. ముందుగా ప్యూరిఫైయర్స్ ను వాడేందుకు 100ప్రదేశాలను ఎంచుకున్నాం. స్టాండింగ్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపాక వీటిని అమర్చుతాం. ఒక్కో యూనిట్ 60అడుగుల వ్యాసార్థం వరకూ ఉన్న కాలుష్య గాలిని శుభ్రం చేయగలదు. ఇటువంటి వాటిని మహారాష్ట్ర, ఢిల్లీల్లో వాడుతున్నారు. ఒక్కో యూనిట్ రూ.75వేలు ఖర్చు అవుతుంది.