సమ్మె విరమించి, చర్చలకు వెళ్లండి : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది.

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 10:52 AM IST
సమ్మె విరమించి, చర్చలకు వెళ్లండి : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Updated On : October 15, 2019 / 10:52 AM IST

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది. ప్రభుత్వం – యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలు తెలపడానికి అనేక మార్గాలున్నాయంటూ తెలిపింది. ఆఖరి అస్త్రం ఉపయోగించినా ఫలితం లేదుకదా అని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ సమ్మెపై విచారణను అక్టోబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు సాగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు స్పష్టం చేశారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పోరేషన్లు ముందుకొస్తాయని తెలిపింది. కార్మికుల సమ్మె ప్రజలపై పడకుంగా 6 వేల బస్సులను నడుపుతున్నామని కోర్టుకు తెలిపింది. 

ప్రైవేటు వ్యక్తులు బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. యూనియన్ తరపు నుంచి దేశాయక్ ప్రకాశ్ వాదానలు వినిపిస్తున్నారు. కార్మికుల సమస్యలపై 30 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని. ప్రభుత్వమే ఎలాంటి చర్యలు చేపట్టలేదు, ఆఖరి అస్త్రంగా సమ్మెకు వెళ్లడం జరిగిందని చెప్పారు. సమస్యలపై అనేకసార్లు విన్నపాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. 

సమ్మె అనేది కార్మికులకు ఉన్న ఆఖరి అస్త్రమని యూనియన్ తెలిపింది. సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కారం కావని యూనియన్ చెప్పింది. ఆర్టీసీ సంస్థకు పూర్తి స్థాయి ఎండీ లేరని..సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదని యూనియన్లు వాపోయాయి. 

ఆర్టీసీ సమ్మె 11వ రోజుకు చేరింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 19 తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. బస్సులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా స్థంభించింది. విద్యాలయాలకు సెలవులు ఈనెల 19 వరకు పొడిగించారు. మరోవైపు టీఎస్ ఆర్టీసీ సమ్మెకు ఏపీఎస్ఆర్టీసీ సంఘాల జేఏసీ కూడా మద్దతు ప్రకటించింది.