కరోనాపై యుద్ధం, దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

కరోనా మహమ్మారిపై భారత్‌ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ఆదివారం(మార్చి 22,2020) ఉదయం 7 గంటలకు మొదలైన జనతా కర్ఫ్యూ నుంచి రాత్రి

  • Published By: veegamteam ,Published On : March 22, 2020 / 01:47 AM IST
కరోనాపై యుద్ధం, దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

Updated On : March 22, 2020 / 1:47 AM IST

కరోనా మహమ్మారిపై భారత్‌ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ఆదివారం(మార్చి 22,2020) ఉదయం 7 గంటలకు మొదలైన జనతా కర్ఫ్యూ నుంచి రాత్రి

కరోనా మహమ్మారిపై భారత్‌ యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ప్రధాని మోడీ పిలుపుతో కరోనాపై ప్రజలు యుద్ధం ప్రకటించారు. ఆదివారం(మార్చి 22,2020) ఉదయం 7 గంటలకు మొదలైన జనతా కర్ఫ్యూ రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా 14 గంటలు ప్రజలు కర్ఫ్యూలో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 24 గంటలు బంద్‌ పాటిస్తున్నారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. అటు ప్రజా రవాణా బంద్‌ అయింది. బస్సు, మెట్రో సర్వీసులు, పెట్రోల్‌ బంకులు మూతబడ్డాయి. రాత్రి 10 గంటల వరకు అన్ని రైళ్లు రద్దు చేశారు. దేశవ్యాప్తంగా 2,400 ప్యాసింజర్‌, 1,300 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి. గోఎయిర్ సహా పలు యాజమాన్యాలు విమాన సర్వీసులు రద్దు చేశాయి. అటు ఓలా క్యాబ్ షేరింగ్ సేవలను రద్దు చేశాయి. 

జనతా కర్ఫ్యూతో దేశ రాజధాని ఢిల్లీ వీధులు నిర్మానుష్యంగా మారాయి. ప్రధాని పిలుపుతో ఢిల్లీ వాసులు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకుండా ప్రజలకు కర్ఫ్యూకు సహకరిస్తున్నారు.

తెలంగాణలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రైవేట్ వాహనాలు కూడా స్వచ్ఛదంగా బంద్‌ అయ్యాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వ్యాపారులు షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. జనతా కర్ఫ్యూలో హైదరాబాద్‌ వాసులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్‌ ప్రజలు ఎవరూ బయటకు రావడం లేదు. అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్ అయ్యాయి. వైద్యులు, అత్యవసర సేవలు అందిస్తున్న వారికి సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలు చప్పట్లతో సంఘీభావం తెలుపనున్నారు.

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో విజయవాడ బస్టాండ్ బోసిపోయింది. నిన్న(మార్చి 21,2020) రాత్రి నుంచే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ప్రభుత్వం రద్దు చేసింది. ఎప్పుడూ రద్దీగా కనిపించే విజయవాడ పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ బస్ స్టేషన్‌ నిర్మానుష్యంగా మారింది. ఉదయం నుంచి కూడా బస్సులన్నీ బస్టాండ్‌కే పరిమితమయ్యాయి.