నీటి పంపకాలు : తెలంగాణకు 79, ఏపీకి 69.346 టీఎంసీలు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. (అక్టోబర్ 4, 2019) నుంచి వినియోగం కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 79 టీఎంసీలు, ఏపీకి 69.346 టీఎంసీలు నీరు విడుదలకు అనుమతి తెలిపింది. నవంబర్ వరకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేసింది.
తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 15 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా 45 టీఎంసీలు, ఏఎమ్ ఆర్ పీ, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం 2 టీఎంసీలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీకి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 3.03 టీఎంసీలు, హంద్రీనీవా-ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 9.74 టీఎంసీలు, సాగర్ కుడి, ఎడమ కాల్వల ద్వారా 48 టీఎంసీలు, కృష్ణా డెల్టా ద్వారా 8.49 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.