గర్ల్స్ కోసం గవర్నమెంట్ : ఫస్ట్ పాలిటెక్నిక్‌ కాలేజ్ 

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 03:57 AM IST
గర్ల్స్ కోసం గవర్నమెంట్ : ఫస్ట్ పాలిటెక్నిక్‌ కాలేజ్ 

Updated On : May 1, 2019 / 3:57 AM IST

పాలిటెక్నిక్ అంటే ఇష్టపడే అమ్మాయిలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇప్పటి వరకూ అమ్మాయిల కోసం ప్రత్యేకించి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అమ్మాయిల కోసం ప్రత్యేకించి పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఈ కాలేజ్ జూన్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. 
 

అన్ని సౌకర్యాలతో కూడిన ఈ కాలేజ్ లో కంప్యూటర్‌ ల్యాబ్‌, ఇంగ్లిష్‌ ల్యాబ్‌, ట్యుటోరియల్‌, లైబ్రరీలతో పాటు అన్ని ఫెసిలిటీస్ తో మారేడుపల్లిలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోనే ఏర్పాటు చేస్తున్నారు. జూన్‌ 1నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌, హోమ్‌ సైన్స్‌ కోర్సులు ఉంటాయి. ఒక్కో కోర్సుకు సంబంధించి 60 సీట్లు కేటాయించారు.  మే రెండో వారంలో జరిగే కౌన్సెలింగ్‌ తరువాత ర్యాంకులు పొందిన విద్యార్థినిలు జూన్‌ 1వ తేదీ నుంచి క్లాసులకు అటెండ్ కావాల్సి ఉంటుంది.