జాగ్రత్త : మరో రెండు రోజులు వర్షాలు

  • Published By: madhu ,Published On : January 26, 2019 / 10:17 AM IST
జాగ్రత్త : మరో రెండు రోజులు వర్షాలు

Updated On : January 26, 2019 / 10:17 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం ఏర్పడుతోంది. చలికాలంలో వానలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడడంతో రైతులు పలు ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. జనవరి 26, జనవరి 27వ తేదీల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. క్యూమిలోనింబస్ మేఘాల వల్ల తెలంగాణ, కోస్తాంధ్రతో పాటు చత్తీస్ ఘడ్‌లో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. 

ఇక హైదరాబాద్‌లో జనవరి 26వ తేదీ ఉదయం నుండి ఆకాశం మేఘావృ‌తమై ఉంది. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఉదయం 11గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో అక్కడకక్కడ చినుకులు..తేలికపాటి వర్షం పడడంతో నగర వాసులు తెగ ఎంజాయ్ చేశారు. రిపబ్లిక్ డే హాలిడే కావడంతో కూల్ వాతావరణాన్ని ఆస్వాదించారు. వర్షం పడడంతో ట్రాఫిక్ రద్దీ కూడా అంతగా లేదు.