బైక్‌లో పాము.. డ్రైవింగ్‌లో హడల్

బైక్‌లో పాము.. డ్రైవింగ్‌లో హడల్

Updated On : September 3, 2019 / 7:11 AM IST

హైదరాబాద్ లో రోడ్డుపై ప్రయాణిస్తుండగా స్కూటీలో ఉన్న పాము ఒక్కసారిగా బయటకు వచ్చి వాహనం నడుపుతున్న వ్యక్తిని భయబ్రాంతులకు గురి చేసింది. నాంపల్లిలో నివసిస్తున్న ఎఫ్‌సీఐ ఉద్యోగి రాములు బైక్ నడుపుతుండగా పాము అతని చేతికి చుట్టుకునే ప్రయత్నం చేసింది. 

భయానికి గురైన రాములు స్కూటీని పడేసి పరుగుపెట్టాడు.  స్వల్ప గాయాలవడంతో ప్రథమి చికిత్స నిర్వహించారు. మహంకాళి ఆలయ సమీపంలో వాహనం పడిపోవడంతో స్నేక్ క్యాచర్ మైసమ్నను పిలిపించారు. 

బైక్‌లో పామును బయటకు రప్పించేందుకు ఎన్నిప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోయింది. చివరకు బౌక్ పార్ట్‌లు ఊడదీసి పామును బయటకు తీశారు. పామును సంబంధిత శాఖ కు అప్పగించారు. క్షణాల్లో ప్రమాదం తప్పడంతో రాములు ఊపిరి పీల్చుకున్నాడు.