ఇంటర్ ఫలితాలు పోలింగ్ తర్వాతే!

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్ధుల భవితవ్యం సార్వత్రిక ఎన్నికలకు ముందే తేలనుందంటూ వచ్చిన వార్తలను ఇంటర్ బోర్డు ఖండించింది. ఏప్రిల్ 8వ తేదీన ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అందులో ఏ మాత్రం నిజం లేదని బోర్డు వెల్లడించింది.
11న తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అంతకుముందే ఫలితాలు ఇవ్వడం కుదిరే పని కాదని, తొలిదశ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తర్వాతే ఇంటర్ ఫలితాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు 10Tv కి తెలిపింది. అయితే స్పష్టమైన డేట్‌ను మాత్రం బోర్డు తెలపలేదు.
రాష్ట్రవ్యాప్తంగా 1300 పరీక్ష కేంద్రాల్లో 9,42,719 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. దీనపై అఫిషియల్‌గా ప్రకటన త్వరలో ఇవ్వనున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే ఏప్రిల్ 11వ తేదీ తర్వాత ఇంటర్ ఫలితాలు రావడానికి కనీసం 2రోజులు పట్టవచ్చు. ఇక సోషల్ మీడియాలో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 8వ తేదీన అంటూ వచ్చిన వార్తలను నమ్మొద్దని, అధికారులు చెప్పారంటూ వచ్చిన వార్తలు వట్టి రూమర్లు అని స్పష్టం చేశారు.