అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 04:49 AM IST
అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు

Updated On : January 19, 2019 / 4:49 AM IST

హైదరాబాద్ : నగరంలో అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుండి ప్రతినిధులు హైదరాబాద్‌కు విచ్చేశారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జనవరి 19 – 21వ తేదీ వరకు సదస్సు జరుగనుంది. 
ఇక ఈ సదస్సులో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హాజారే, ప్రత్యేక అతిథిగా సార్క్ మాజీ సెక్రటరీ జనరల్ అర్జున్ బహదూర్ థాపా హాజరు కానున్నారు. 20వ తేదీ ముగింపు సమావేశానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరు కానున్నారు. మొత్తం 135 దేశాల నుండి 550 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 16 దేశాల నుండి 70 మంది వక్తలు, 40 ప్రత్యేక ఆహ్వానితులు హాజరౌతారని నిర్వాహకులు వెల్లడించారు. 

  • వివిధ అంశాలపై చర్చించేందుకు ప్రత్యేక హాళ్ల ఏర్పాటు
  • చర్చగోష్టి నిర్వహించనున్న ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తా. 
  • ప్యానెలిస్టులుగా ఎంపీ ఓవైసీ, అసోం ఎంపీ గౌరవ్ గగోయ్, ఎంపీ కవిత. 
  • గాంధీ యూత్ అండ్ సస్టెసనబులిటీ, ప్రాసె్పక్టివవ్స్ ఫ్రం ద వరల్డ్ అంశంపై వక్తలు : అప్ఘనిస్తాన్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ వ్యవస్థాపకుడు జాన్ డిక్సన్,  మాసిడోనియా రిపబ్లిక్ పెట్టుబడుల శాఖ మంత్రి గ్లిగర్ తస్కోవిచ్, శ్రీలంక పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉపమంత్రి  బుదికా పథిరాణా, న్యూజిలాండ్ ఎంపీ కన్వజిత్ సింగ్, యునైటెడ్ నేషనల్స్‌లో నేపాల్ శాశ్వత ప్రతినిధి మధు రామన్ ఆచార్య.