నేడు, రేపు తెలంగాణలో మోస్తారు వర్షాలు

హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కేరళ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలోని మహబూబ్ నగర్ 40, మెదక్ 39, ఆదిలాబాద్, హకీంపేట్, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భద్రాచలం, రామగుండంలలో 36, నల్లగొండలో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.