హైదరాబాద్ లో గాలివాన బీభత్సం : కూలిన ఎల్బీ స్టేడియం ఫ్లడ్ లైట్ టవర్… ఒకరి మృతి

హైదరాబాద్ లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలింది. దీంతో వ్యక్తి మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈదురుగాలులకు లక్డీకాపూల్ లో హోర్డింగ్ కూలింది. తార్నాక, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ తోపాటు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్లు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపైకి వర్షపు నీరు చేరింది. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది.
గంటకు 50 కిలో మీటర్ల వేగంగతో గాలులు వీస్తున్నాయి. నగర వ్యాప్తంగా విద్యుత్ నిలిపివేశారు. ఇంజనీరింగ్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ ఎంసీ కమాండ్ కంట్రోల్ నుంచి ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కూలిన చెట్లను జీహెచ్ ఎంసీ డిజాస్టర్ సిబ్బంది తొలగిస్తున్నారు. కొద్దిసేపట్లో ఎల్బీ స్టేడియంకు జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ చేరుకోనున్నారు.