రాహుల్ గాంధీ ప్రత్యేక పిలుపు.. ‘ఆర్మీ ఆఫ్ ట్రూత్‌’లో జాయన్ అవండి

రాహుల్ గాంధీ ప్రత్యేక పిలుపు.. ‘ఆర్మీ ఆఫ్ ట్రూత్‌’లో జాయన్ అవండి

Updated On : February 9, 2021 / 10:06 AM IST

Rahul Gandhi: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సోమవారం న్యూ సోషల్ మీడియా రిక్రూట్మెంట్ డ్రైవ్ లో జాయిన్ అవమంటూ పిలుపునిచ్చారు. తమ పార్టీకి చెందిన ఆర్మీ ఆఫ్ ట్రూత్ లో జాయిన్ కావాలని.. అలా చేసి పెయిడ్ ప్రచారంతో పోరాడాలని అన్నారు. ఈ మేరకు #JoinCongressSocialMedia కాంపైన్ తో కలవాలన్నారు. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పర్సనల్ మెసేజ్‌ను ఈ మేరకు పోస్టు చేశారు.

ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్టు చేసి.. ‘ఈ పెయిడ్ ప్రమోషన్ వెనుక ఉద్దేశ్యం ట్రోలింగ్ చేయడం లేదా, ద్వేషపూరిత వ్యాఖ్యలు, కోపం పుట్టించడం కోసం’ అని అన్నారు. అలాగే మనకు కూడా వారియర్స్ కావాలి.. ఉదార విలువలు ఉన్న వారు సామరస్యం, కరుణ, శాంతి కోసం పరితపించేవారు. వచ్చి ఆర్మీలో జాయిన్ అవండి’

కాంగ్రెస్ లీడర్ ‘Army of truth’ లో జాయిన్ అవ్వాలని.. ద్వేషపూరితమైన వాళ్లు కాదు. ఈ ప్లాట్‌ఫాం మీ కోసమే. ఈ యుద్ధం చేయడానికి అందులో గెలవడానికి ఆయుధాలు కల్పిస్తామని చెప్పారు. ఇంకా ఈ ట్వీట్‌లోనే హెల్ప్ లైన్ నెంబర్, సోషల్ మీడియా పేజి వివరాలు.. మొత్తం చెప్పేశారు.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ ఛార్జ్ (అడ్మినిస్ట్రేషన్)పవన్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ.. దాదాపు 5లక్షల మంది సోషల్ మీడియా వారియర్స్ ను సిద్ధం చేయడమని అన్నారు. దానికి తగ్గట్టుగానే బాధ్యతలు అప్పజెప్తామని అన్నారు. ప్రజలు పలు లెవల్స్‌లో పనిచేస్తారని అన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ విభాగాల వారీగా పనిచేస్తారని అన్నారు.