మాజీ మేయర్ ఎలా సంపాదించాడో: బేస్‌మెంట్‌లో రెండు లారీల బంగారం

  • Published By: madhu ,Published On : September 29, 2019 / 06:06 AM IST
మాజీ మేయర్ ఎలా సంపాదించాడో: బేస్‌మెంట్‌లో రెండు లారీల బంగారం

Updated On : September 29, 2019 / 6:06 AM IST

బంగారమంటే అందరికీ మక్కువే. కొందరు బంగారాన్ని ఆభరణాలుగా మార్చి ఒంటిపై వేసుకుని మురిసిపోతే.. మరికొందరు కొని దాచుకుంటారు. ఇంకొందరు గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బంగారాన్ని సొంతం చేసుకుంటారు. అయితే ఎవరి దగ్గరైనా ఎంత బంగారం ఉంటుంది. ఓ 20 తులాలు లేదంటే 50  తులాలు. అదీకాదంటే కిలో రెండు కిలోలు. మహా అయితే  ఎక్కువలో ఎక్కువ 10 కిలోలు. ఎవరిదగ్గరైనా అంతకు మించి అంటే టన్నుల కొద్దీ బంగారం ఉంటే ఎలా ఉంటుంది. ఊహకే అందడంలేదు కదూ.. కానీ చైనాలో సరిగ్గా ఇదే జరిగింది.

చైనాలోని డాంజౌ పట్టణ మాజీ మేయర్ జాంగ్ క్వి. గుట్టల కొద్దీ బంగారాన్ని పోగేశాడు. కిలోలు కాదు క్వింటాళ్లు కాదు.. టన్నుల కొద్దీ గోల్డ్‌ను దాచేశాడు. ఇందుకోసం తన నివాసంలో ఓ నేలమాళిగనే నిర్మించాడు. ఎవరికీ తెలియకుండా దాచిన ఈ భారీ బంగారం గుట్టు గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంట్లో తనిఖీలు చేయడంతో వారి కళ్లు బైర్లు కమ్మాయి.

Read More : ఘోర రోడ్డు ప్రమాదం : ట్రక్కుని ఢీకొన్న బస్సు.. 36మంది

బేస్‌మెంట్‌ను పగలగొట్టి లోనికి వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యే సీన్ కనిపించింది. ఎక్కడ చూసినా బంగారం కడ్డీలే కనిపించాయి. ర్యాకుల్లో సామగ్రిని సర్దినట్లుగా బంగారం బిస్కట్లను నీట్‌గా సర్దేశాడు. ఇక్కడ దొరికిన బంగారాన్ని తూకం వేసిన అధికారులు ఆ మొత్తాన్ని ఏకంగా 13.5 టన్నులుగా తేల్చారు. దీనివిలువ చైనా కరెన్సీలో 268 బిలియన్ యువాన్లుగా నిర్ధారించారు. ఈ రహస్య నేలమాళిగలో బంగారమేకాదు… పెద్ద ఎత్తున నోట్ల కట్టలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.