ఆయన అంతే! : శ్రీలంకలో 138 మిలియన్ల మంది చనిపోయారట

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2019 / 12:12 PM IST
ఆయన అంతే! : శ్రీలంకలో 138 మిలియన్ల మంది చనిపోయారట

Updated On : April 21, 2019 / 12:12 PM IST

శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటన ఖండిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరపాటుగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా ప్రజల తరపున శ్రీలంకలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 138 మిలియన్ల మందికి, 600కి పైగా గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి అంటూ ట్వంప్ చేసిన ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 138మంది అని చెప్పబోయి 138 మిలియన్ల మంది అని ట్రంప్ చేసిన ట్వీట్ పై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో  ఆ ట్వీట్ ని డిలీట్ చేసి దాని స్థానంలో ట్రంప్ మరో ట్వీట్ చేశారు.
ఆదివారం(ఏప్రిల్ 21,2019) ఉదయం 8గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల వ్యవధిలో వరుసగా 8 బాంబులు పేలాయి. చర్చిలు, హోటళ్లే టార్గెట్ గా బ్లాస్ట్ లు జరిగాయి. కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోవా చర్చిలలో… షాంగ్రిల్లా, సినామోన్ గ్రాండ్, కింగ్స్ బరీ హోటల్స్ లో బ్లాస్ట్ లు జరిగాయి. 2 చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ వరుస పేలుళ్లలో ఇప్పటివరకు 207మంది చనిపోయినట్టు అక్కడి పోలీసులు తెలిపారు.450మంది గాయాలపాలై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారని,మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు.