ఇటలీలో కరోనా మృత్యుఘోష.. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు
ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు.

ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు.
ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. నిన్న ఒక్కరోజే 189 మంది చనిపోయారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా పౌరులు చనిపోయారు. దీంతో ఇటలీ దేశం ఇప్పుడు ఓ నిశ్శబ్దప్రాంతంగా మారిపోయింది.
ఫుడ్ స్టోర్స్, ఫార్మసీలు..ఈ రెండూ తప్ప ఇటలీలో ఇప్పుడు ఏ దుకాణం తెరిచి కన్పించడం లేదు..ఎటు చూసినా రెస్టారెంట్లు..షాపులు..బార్లు..స్కూళ్లు..కాలేజీలు..ఆఫీసులు అన్నీ అన్నీ మూసేసి కన్పిస్తున్నాయ్. దేశం మొత్తం శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. కరోనా వైరస్ ఉధృతి ఇలానే కొనసాగితే ఇటలీలో మానసిక వ్యాధులు ప్రబలే అవకాశం కూడా కన్పిస్తోంది. (ఇరాన్‌లో కరోనా మరణ మృదంగం : ఒక్క రోజే 75 మంది మృతి )
కరోనా కోరల్లో విలవిలలాడుతోన్న ఇటలీవాసులు ఇక్కడి జైళ్ల ముందు ధర్నాలకు దిగారు..జైళ్లలోని తమ బంధువులకు వైరస్ సోకుతుందని.. వారిని వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అసలే వైరస్ విస్తరిస్తున్న తీరుతో బెంబేలెత్తుతున్న జనం..ఓ నలుగురు గుమిగూడాలన్నా వణికిపోతున్నారికక్కడ వందమందికి మించిన ఎలాంటి ఫంక్షన్లూ కూడా నిర్వహించుకోవద్దంటూ అధికారులు ప్రజలకు ఆదేశాలు జారీ చేసారు.
దేశం మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. ..ఫుట్ బాల్ లవర్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన ఇటలీలో మొత్తం ఆటలన్నీ నిలిపివేశారు. 12వేలకి పైబడిన వైరస్ బాధితులలో 900మంది ఐసియూలో చికిత్స పొందుతుండటం వైరస్ ఉధృతికి నిదర్శనం..అంతేకాదు ఇక్కడి పరిస్థితే మిగిలిన దేశాలకూ దాపురిస్తుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఎమర్జెన్సీ హెడ్ మైఖేల్ రేయాన్ హెచ్చరిస్తుండటం అన్ని దేశాలను భయాందోళనలోకి నెట్టేస్తోంది. ఆయన చెప్పిందే కనుక నిజమైతే..ఆ ఊహే వళ్లు జలదరింపజేస్తోంది..అఁదుకే ప్రపంచ ఆరోగ్యసంస్థే అన్ని దేశాలను కరోనాని ఎదుర్కొనే పద్దతులను పంచుకోవాల్సిందింగా విజ్ఞప్తి చేసింది.