China-Taiwan Conflict: చైనా బలప్రదర్శన.. తైవాన్ వైపు దూసుకెళ్లిన 71 యుద్ధ విమానాలు..

గడిచిన 24 గంటల్లో 71 యుద్ధ విమానాలు, ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ జల సంధి వరకు సుమారు 47 చైనా రక్షణశాఖ విమానాలు వచ్చినట్లు తెలిపారు.

China-Taiwan Conflict: చైనా బలప్రదర్శన.. తైవాన్ వైపు దూసుకెళ్లిన 71 యుద్ధ విమానాలు..

Cnina

Updated On : December 26, 2022 / 12:12 PM IST

China-Taiwan Conflict: తైవాన్ పై చైనా కాలుదువ్వుతోంది. తైవాన్ ద్వీపాన్ని ఆక్రమించుకునే లక్ష్యంగా డ్రాగన్ కంట్రీ సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా తైవాన్ సరిహద్దులకు దగ్గరగా 71 విమానాలు, ఏడు నౌకలను ప్రదర్శనకు పంపించింది. చైనా తన సొంత భూభాగమని చెప్పుకునే స్వయంపాలిత తైవాన్ పై డ్రాగన్ సైనిక వేధింపులు ఇటీవలికాలంలో పెరిగాయి. తైవాన్ మాత్రం తమది స్వతంత్ర్య దేశం అని చెబుతోంది. తైవాన్ వాదనకు అమెరికా మద్దతుగా నిలుస్తోంది. దీంతో డ్రాగన్ కు కోపం కట్టలు తెంచుకుంటుంది.

China-India relation: ఇండియాతో సంబంధాలపై చైనా కీలక ప్రకటన.. కలిసి పని చేసేందుకు సిద్ధమన్న చైనా మంత్రి

తైవాన్‌లో ఈ ఏడాది ఆగస్టులో అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటించారు. ఈ క్రమంలో తైవాన్‍కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయంలో చైనా తైవాన్ సరిహద్దుల్లోకి యుద్ధవిమానాలను పంపించి భయాందోళనకు గురిచేసింది. తాజాగా అమెరికా రక్షణ బిల్లులో తైవాన్ కు కొన్ని కేటాయింపులు చేసింది. దీంతో అమెరికా తీరుపై మండిపడుతున్న చైనా.. తైవాన్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

China-taiwan : నా దేశ స్వతంత్రాన్ని రక్షించడమే నా లక్ష్యం : జిన్‌పింగ్‌కు సూటిగా సమాధానం చెప్పిన తైవాన్ ప్రెసిడెంట్ ఇంగ్ వెన్

ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో 71 యుద్ధ విమానాలు, ఏడు భారీ నౌకలను కూడా తైవాన్ దిశగా చైనా మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తైవాన్ జల సంధి వరకు సుమారు 47 చైనా రక్షణశాఖ విమానాలు వచ్చినట్లు తెలిపారు. వీటిలో జే-16 ఫైటర్ జెట్స్ 18, జే-1 ఫైటర్ విమానాలు 11, ఆరు సుఖోయ్-30 ఫైటర్ విమానాలతో పాటు డ్రోన్లను కూడా తైవాన్ పైకి చైనా పంపించినట్లు తైవాన్ ఆరోపిస్తుంది.