వైరల్ ఫోటో : అమ్మకు ఆపరేషన్…హత్తుకుని వదలని కోలా కూన

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 04:56 AM IST
వైరల్ ఫోటో : అమ్మకు ఆపరేషన్…హత్తుకుని వదలని కోలా కూన

Updated On : January 7, 2020 / 4:56 AM IST

ఆస్ట్రేలియా కార్చిచ్చు నుంచి ప్రాణాలతో బైటపడిన ఓ జంతువుకి డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. కార్చిచ్చు నుంచి బతికి బైటపడ్డ కోలా అనే జంతువును బతికించేందుకు డాక్టర్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలో  ఆ తల్లికి పుట్టిన కూన తల్లిని విడిచిపెట్టకుండే తల్లినే అంటిపెట్టుకుని ఉంటోంది. అమ్మకు ఏమీ కాకూడదు అన్నట్లు ఆ కూన తల్లిమీదనే పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో నెటిజన్లను కంటతడిపెట్టిస్తోంది. 

ఆస్ట్రేలియా కార్చిచ్చు  కోట్లాది మూగజీవులు అగ్నికి ఆహుతి అయిపోయిన అందరినీ తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. గత సెప్టెంబరు నుంచి ఇప్పటివరకూ మొత్తం 50 కోట్ల జంతువులు సజీవదహనం అయిపోయాయనే వార్త అందరి మనస్సుల్ని కలసివేస్తోంది. ఈ కార్చిచ్చుకు ప్రభావానికి గురైన లక్షలాది జంతువుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక ఫొటో చూసినవారందరినీ కంట తడిపెట్టిస్తోంది.

క కోలా(చిన్నసైజు ఎలుగు బంటిలా కనిపించే ఆస్ట్రేలియా ఖండానికి చెందిన శాకాహార జీవి, అది చూడటానికి పెద్ద సైజు పాండాలా కనిపిస్తుంది)కి డాక్టర్లు చికిత్స చేస్తుండగా..దాని పిల్ల కూన తల్లిని గట్టిగా అతుక్కుపోయింది. తల్లీపిల్లల ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఈ ఫొటో చూపరులను భావోద్వేగానికి గురిచేస్తోంది. డాక్టర్లు ఈ కోలా తల్లికి ‘లిజీ’ అని పేరు పెట్టారు. దాని కూనకు ‘పాంటమ్’ అని పేరు పెట్టారు.