షేక్ హసీనా భారత్‌లోకి అడుగుపెట్టే ముందు వాయుసేన ఫైటర్ జెట్లు ఏం చేశాయో తెలుసా!

బంగ్లాదేశ్ లోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతాను కట్టుదిట్టం చేశారు.

షేక్ హసీనా భారత్‌లోకి అడుగుపెట్టే ముందు వాయుసేన ఫైటర్ జెట్లు ఏం చేశాయో తెలుసా!

Sheikh Hasina

Bangladesh Government Crisis : కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత ఆమె దేశం విడిచిపెట్టారు. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్ (యునైటెడ్ కింగడమ్) కు వెళ్లొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆమె భారత్ లోనే ఉన్నారు. ఇదిలాఉండగా.. బంగ్లాదేశ్ లోని జమాతే ఇస్లామీ అనే సంస్థ పెద్ద ప్రకటన చేస్తూ.. షేక్ హసీనా ఎక్కడ బసచేసినా ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొంది.

Also Read : బంగ్లా ప్రధాని పీఠాన్ని కూల్చిన రిజర్వేషన్ల లొల్లికి కారణాలు ఏంటి? పాకిస్థాన్ హస్తమూ ఉందా?

ప్రధాని పదవికి రాజీనామా అనంతరం బంగ్లాదేశ్ ను షేక్ హసీనా విడిచిపెట్టారు. ఆమె ఏజేఎక్స్ అనే సీ-130జే విమానంలో సోమవారం సాయంత్రం 5.30గంటల సమయంలో భారత్ సరిహద్దుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు భారత భద్రతా బలగాలు గమనించాయి. అందులో ఎవరు ఉన్నారో ముందే పసిగట్టిన అధికారులు భారత్ లోకి అనుమతించాలని ఆదేశించారు. విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే భారత వైమానిక దళం యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానాన్ని భారత ఫైటర్స్ జెట్లు అనుసరించాయి. బీహార్, ఝార్ఖండ్ మీదుగా ఆవి రక్షణ కల్పించాయి. ఆమె భారత్ లోకి అడుగుపెట్టే సమయంలో భారత వాయుసేన, సైన్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందే సిద్ధపడిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Also Read : రాజీనామా చేసి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన బంగ్లా ప్రధాని.. బంగ్లాదేశ్‌లో సైనిక పాలన: ఆర్మీ చీఫ్

షేక్ హసీనా విమానం సోమవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో హిండన్ ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెతో భేటీ అయ్యారు. ఇదిలాఉంటే.. హసీనా భారత్ దేశానికి చేరుకోవటంతోపాటు.. బంగ్లాదేశ్ లోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతాను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు. మరోవైపు ఢాకా నగరానికి ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది.