Ex CIA chief warning to Prigozhin : కిటికీల చుట్టూ జాగ్రత్తగా ఉండండి..ప్రిగోజిన్‌కు సీఐఏ మాజీ చీఫ్ హెచ్చరిక
రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని సీఐఏ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ డేవిడ్ పెట్రేయస్ సూచించారు. రష్యాపై తిరుగుబాటు చేసి అనంతరం మధ్యవర్తిత్వంతో బెలారస్ లో తలదాచుకున్న ప్రిగోజిన్ నివాసమున్న భవనం కిటికీల చుట్టూ జాగ్రత్తగా ఉండాలని డేవిడ్ కోరారు....

Ex CIA chief warning to Prigozhin
Ex CIA chief warning to Prigozhin : రష్యాపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ జాగ్రత్తగా ఉండాలని సీఐఏ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ డేవిడ్ పెట్రేయస్ సూచించారు. (Be very careful around windows) రష్యాపై తిరుగుబాటు చేసి అనంతరం మధ్యవర్తిత్వంతో బెలారస్ లో తలదాచుకున్న ప్రిగోజిన్ నివాసమున్న భవనం కిటికీల చుట్టూ జాగ్రత్తగా ఉండాలని డేవిడ్ కోరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కిరాయి సైనిక నాయకుడు ప్రిగోజిన్ 24 గంటల్లోనే నాటకీయంగా యూటర్న్ తీసుకున్నారు.
Odisha Bus Accident : ఒడిశాలో రెండు బస్సులు ఢీ, 10 మంది మృతి, 8మందికి గాయాలు
వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్ యవ్జెనీ ప్రిగోజిన్ తన ప్రాణాలు కాపాడుకున్నా, అతని వాగ్నర్ గ్రూప్ ను కోల్పోయాడని సీఐఏ మాజీ డైరెక్టర్ చెప్పారు. వాగ్నర్ తిరుగుబాటు రష్యా ప్రభుత్వాన్ని బలహీనపరిచిందని సీఐఏ మాజీ డైరెక్టర్ డేవిడ్ పెట్రాయస్ అన్నారు. రష్యన్ పారామిలిటరీ గ్రూప్ వాగ్నర్ చీఫ్ ను తెరిచి ఉన్న కిటికీలకు దూరంగా ఉండమని డేవిడ్ పెట్రాయస్ హెచ్చరించారు. మాస్కోపై కవాతును ఆపడానికి ఒప్పందంలో భాగంగా, కిరాయి నాయకుడు పొరుగున ఉన్న బెలారస్ కు వెళ్లడానికి అంగీకరించాడు.
PM Modi Returns To India : ముగిసిన యూఎస్,ఈజిప్టు పర్యటన, స్వదేశానికి తిరిగివచ్చిన మోదీ
బెలారస్ నాయకుడు అలెగ్జాండర్ లుకాషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బలమైన మిత్రుడు. కవాతు చేస్తున్న కిరాయి సైనికులు, క్రెమ్లిన్ మధ్య ఒక ఒప్పందాన్ని కుదర్చడంలో బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకో పాత్ర ఉంది. వాగ్నర్ తిరుగుబాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రత్యక్ష సవాలు అని అమెరికా పేర్కొంది. రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించినప్పటి నుంచి పుతిన్‌పై విమర్శలు చేసిన వారు మరణించడం మిస్టరీగా మిగిలింది.
US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్‌గార్డ్ పరిశోధన
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను విమర్శించిన రష్యా అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ కంపెనీ బోర్డు ఛైర్మన్ ఆసుపత్రి కిటికీలోంచి పడిపోయి మరణించాడని చెప్పారు. ‘‘ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని విమర్శించిన కొందరితో సహా పలువురు రష్యన్లు, పైకప్పులపై నుంచి, ఎత్తైన కిటికీల నుంచి పడి చనిపోయారని సీఐఏ మాజీ చీఫ్ చెప్పారు.
Kyriakos Mitsotaki wins as Greek PM : కైరియాకోస్ మిత్సోటా గ్రీక్ ప్రధానిగా రెండోసారి ఘన విజయం
రష్యా శాసనసభ్యుడు పావెల్ ఆంటోవ్ గతేడాది భారత్‌లోని ఓ హోటల్‌పై నుంచి పడి మరణించిన సంగతి తెలిసిందే. ప్రిగోజిన్ చేసిన సాయుధ తిరుగుబాటు రష్యాలో అతిపెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీసింది. పలు విమానాలను కూల్చివేసినట్లు వాగ్నర్ పేర్కొన్నప్పటికీ, రష్యా అధికారులు ఎలాంటి మానవ నష్టాలను నివేదించలేదు.