శ్రీలంకలో బాంబు పేలుళ్లు : ప్రధాని రణీల్ విక్రమసింఘే అత్యవసర సమావేశం

వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లిపోతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే ఎమర్జనీ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొలంబోలో జరిగిన ఆరు ప్రాంతాలలో సంభవించిన బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతులకు శ్రీలంక ప్రభుత్వం తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.
గాయపడ్డవారిని ఇప్పటికే వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు శాంతియుతంగా ఉండాల్సిందిగా కోరుతున్నట్లు దేశాధ్యక్షుడు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వదంతులను నమ్మొద్దని, ఐక్యత ప్రదర్శిస్తూ ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రధాని రణీల్ విక్రమసింఘే కోరారు. కాగా ఈ పేలుళ్లలో ఇప్పటి వరకూ మృతి చెందినవారి సంఖ్య 185కు చేరింది.
#SriLanka PM Ranil Wickremsinghe holds emergency meeting to review situation, requests public to remain calm and united. pic.twitter.com/anfKZJF2Bp
— All India Radio News (@airnewsalerts) April 21, 2019