బ్రెజిల్ లోమరోసారి కరోనా పంజా..తీవ్రంగా ఆక్సిజన్ కొరత..క్యూలో ప్రజలు

Brazil : With Oxygen Supply Running Low, People In Queue : కరోనా..ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి పారేసింది.ఆర్థిక వ్యవస్థల్ని అస్తవ్యవస్థం చేసేసింది. కరోనా మహమ్మారి సోకి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వచ్చినవారికి అవసరమైన ఆక్సిజన్ కూడా అందనటువంటి దుర్భర పరిస్థితులు వచ్చే కల్లోలాన్ని సృష్టించింది. ఈక్రమంలో కరోనా బ్రెజిల్‌లో కొత్త వేరియంట్ బీభత్సం సృష్టిస్తోంది. బ్రెజిల్ లో భారీ స్థాయిలో కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి.
దీంతో అమెజాన్ రాష్ట్రంలోని మానౌస్ నగరంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. కరోనా వైరస్‌తో తీవ్ర శ్వాస కోస ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్రెజిల్ ప్రజలు ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ సిలిండర్ల కోసం ఎగబడుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల రీఫిల్లింగ్ కోసం క్యూలైన్లు కడుతున్నారు. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ చేసిన వారిపై దాడులకు కూడా దిగుతున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర భారీ సంఖ్యలో నిలబడి వేచి చూస్తున్నారు. దీంతో బ్రెజిల్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ఆక్సిజన్ ను అందించలేకపోతోందనే విమర్శలు గురవుతోంది.
కోవిడ్ కేసులు వారం వారానికి పెరుగుతుండటంతో బ్రెజిల్ హాస్పిటళ్లలో బెడ్స్ కరవయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో బాధితులకు హాస్పిటల్స్ లో బెడ్స్ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర వైద్య సదుపాయాలు కూడా మందగించాయి. సప్లయ్‌లు తగ్గడం వల్ల భారీ సంఖ్యలో ప్రజలు చనిపోయే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.
అ క్లిష్ట సమయంలో ఆక్సిజన్ కొరత పరిస్థితిపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. అత్యున్నత ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి రికార్డో లెవాండోవ్స్కీ స్పందిస్తూ..ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజల అవసరాలకు తగినట్లు ఆక్సిజన్ సమకూర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటువంటి పరిస్థితిని పరిష్కరించటంలో దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో పరాలన ‘విస్మరించిందని’ పేర్కొన్నారు.
దీనిపై ఆక్సిజన్ కొరత సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకున్నామని..దేశ వైమానిక దళం ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్, టెంట్స్ తో సహా ఎనిమిది టన్నులకు పైగా ఆసుపత్రి వస్తువులను మనౌస్‌కు తీసుకెళ్లిందని బ్రెజిల్ ఉపాధ్యక్షుడు హామిల్టన్ మౌరో ట్విట్టర్‌లో తెలిపారు. కాగా బ్రెజిల్‌లో ఇప్పటి వరకు కరోనాతో రెండు లక్షల మంది మరణించారు.
Nossos militares da @fab_oficial transportaram mais de 8 toneladas de material hospitalar, camas, cilindros de oxigênio, macas e barracas para Manaus. https://t.co/B5e1TjtSDA
— General Hamilton Mourão (@GeneralMourao) January 14, 2021