నాసాతో కలిసి ఇస్రో ప్రయోగం: 13 పేలోడ్లతో చంద్రయాన్-2

భారత రెండో మూన్ మిషన్ చంద్రయాన్-2 జూలైలో ప్రారంభం కానుంది. ఈ మేర షెడ్యూల్‌ను 2019 జూలై 9 నుంచి 16మధ్య నిర్ణయించారు. ఈ కృత్రిమ ఉపగ్రహం 2019 సెప్టెంబర్ 6నాటికి చంద్రుని పైకి చేరనుంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఉపగ్రహం గురించి మరిన్ని విషయాలు గమనిస్తే..
* భారత రెండో మూన్ మిషన్ చంద్రయాన్-2 ఉపగ్రహంలో 13 పే లోడ్‌లు (ఆర్బిటర్‌లో 8, ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2 పేలోడ్లు) ఉంచనున్నట్లు అందులో వివరించారు. ఇవన్నీ స్వదేశీ పేలోడ్లు కాగా మరో ప్రయోగాన్ని అమెరికాలోని నాసా నుంచి చేపట్టనున్నారు.
* చంద్రయాన్-2, భారత సెకండ్ లూనార్ మిషన్‍లో 3మాడ్యుల్‌లు ఉండనున్నాయి. వాటిలో ఒకటి ఆర్బిటర్, ల్యాండర్(విక్రమ్), రోవర్(ప్రగ్యాన్)లు ఉంటాయి.
* ఈ సంవత్సరారంభంలో ఇస్రో చైర్మన్ కే శివన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ చంద్రునిపై ఎవ్వరూ చేరుకోని ప్రాంతానికి మేం ప్రయోగం చేస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువానికి ఈ ప్రయోగాన్ని నిర్దేశించనున్నాం. ఆ ప్రాంతం గురించి తెలియజేయనున్నాం’ అని పేర్కొన్నారు.
* పదేళ్ల క్రితం ప్రయోగించిన చంద్రయాన్-1కు అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఈ చంద్రయాన్-2.
* చంద్రయాన్-1లో భారత్ నుంచి 5, యూరప్ నుంచి 3, యూఎస్ఏ నుంచి 1, బల్గేరియా నుంచి 1 ప్లేలోడ్‌లను పంపారు.
#ISROMissions
Benefits of #Chandrayaan2 pic.twitter.com/JCyJdDIGWk— ISRO (@isro) May 15, 2019